Suryaa.co.in

Telangana

విపక్షాలపై కేసులు పెట్టే ప్రధాని మోదీ.. కేసీఆర్ పై ఎందుకు పెట్టరు?

పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీజేపీకి బీఆరెస్ మద్దతు
సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదు… ప్రజల తెలంగాణ
ఇందిరమ్మ మీ భూముల కోసం కొట్లాడిన సంగతి గుర్తు చేస్తున్నా
బీఆరెస్ కారు టైర్ లో వారికి తెలియకుండానే గాలి పోయింది
ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో… బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోంది
రాహుల్ గాంధీ

దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణలో ప్రజల గొంతు వినిపిస్తుందనుకున్నాం.తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదు… ప్రజల తెలంగాణ. తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయింది.కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. కేసీఆర్ పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారు.

కేసీఆర్ మీ నుంచి దోచుకున్న సొమ్మునంతా మీకు అందేలా చూస్తా.కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయని టీ కొట్టులో వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాంరూ.4వేలు పెన్షన్ అందిస్తాం.మహిళల కోసం మహాలక్ష్మి పథకం. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందించనున్నాం.రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతు భరోసా ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.15వేలు అందిస్తాం.రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వబోతున్నాం.

పసుపు రైతులకు ప్రధాని హామీ ఇచ్చి మోసం చేశారు.ఛత్తీస్ గడ్ లో ఇచ్చిన మాట ప్రకారం వారి ధాన్యాన్నీ క్వింటా రూ.2500 లకు కొంటున్నాం.పసుపు రైతులకు క్వింటాకు రూ.12 వేలు నుంచి 15వేలు ధర కల్పించనున్నాం. నేను అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం. ఇందిరమ్మ మీ భూముల కోసం కొట్లాడిన సంగతి గుర్తు చేస్తున్నా.

సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా ఉన్నారు. తెలంగాణతో నా అనుబంధం ఇప్పటిది కాదు.ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటే.బీఆరెస్ కారు టైర్ లో వారికి తెలియకుండానే గాలి పోయింది. కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నుంచి క్యూ కడుతున్నారు.బీజేపీతో పోరాడిన నాపై 24 కేసులు పెట్టారు. మరి కేసీఆర్ పై ఎన్ని కేసులున్నాయి?

విపక్షాలపై కేసులు పెట్టే ప్రధాని మోదీ.. కేసీఆర్ పై ఎందుకు పెట్టరు? పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీజేపీకి బీఆరెస్ మద్దతు పలికింది. బలం లేకపోయినా ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ను ఓడించేందుకే ఎంఐఎం పోటీ.ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో… బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోంది.రాష్ట్రంలో బీఆరెస్ ను.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో బీజేపీ ని ఓడించి తీరతాం.బీజేపీ, ఎంఐఎం కు ఓటు వేస్తే అది బీఆరెస్ కు వేసినట్లే. తెలంగాణలో రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.

శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుంది.నేను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడకు రాలేదు.ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి వచ్చా.రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించా.తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది. తెలంగాణలో దొరలపాలనను సాగనంపి… ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం.

మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం.నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది.మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్… మేం ఎక్కడ బీజేపీ తో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోంది.బీజేపీతో పోరాడుతున్నందుకు నాపై కేసులు పెట్టారు.లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు.. ఇల్లు లేకుండా చేశారు.నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ… కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరు

కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంపులో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
కాంగ్రెస్ లో చేరిన కేశం పేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాం రెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్ లు.

LEAVE A RESPONSE