– ప్రధాని మీద నమ్మకం తో అపుడు పెద్ద నోట్ల రద్దు ను సమర్ధించాము
– నోట్ల రద్దు తో 50 రోజుల్లో అంతా బాగుంటుందని పెద్దలు భరోసా ఇచ్చారు
– 2 వేల రోజులైంది ఏం మార్పు తెచ్చారు?
– నోట్ల రద్దు గొప్పది కాదు గనుకే బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదు
– మంత్రి టి.హరీష్ రావు, ఎమ్మెల్యే లు కాలేరు వెంకటేష్, కృష్ణమోహన్ రెడ్డి, చిరుమర్ధి లింగయ్య, ఎమ్మెల్సీ లు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్
మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే……
బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి.దీనికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు.నోట్ల రద్దు పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం తో నిజాలు బయటకు వచ్చాయి.నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ షో అని కేంద్రం అంగీకరించకనే అంగీకరించింది. బీజేపీ చేసేది చారాన.. చెప్పేది బారానా. నోట్ల రద్దు గొప్పది కాదు గనుకే బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదు.. మౌనం అంగీకారాన్ని సూచిస్తోంది.నోట్ల రద్దు తో నకిలీ కరెన్సీ తగ్గక పోగా 54 శాతం పెరిగింది అని rbi గణాంకాలు చెబుతున్నాయి.నోట్ల రద్దు మొదటి లక్ష్యం దొంగ నోట్లు అరికట్టడం.. ఇది అట్టర్ ప్లాప్ అయ్యింది.కరెన్సీ చలామణి తగ్గించి డిజిటల్ పే మెంట్స్ పెంచడం నోట్ల రద్దు మరో లక్ష్యం.. ఇది కూడా అట్టర్ ప్లాప్ అయింది.కరెన్సీ చలామణి రెట్టింపు అయ్యింది.నోట్ల రద్దు కు ముందు కరెన్సీ చలామణి జీడీపీ లో 11 శాతం ఉంటే ఇపుడు 13 శాతం కు పెరిగింది.
పెద్ద నోట్ల చలామణి నోట్ల రద్దు తర్వాత రెట్టింపు అయ్యింది.500,1000 నోట్ల రద్దు అన్నారు 2 వేల నోటు తెచ్చారు.పెద్ద నోట్ల వాడకం పతిమితం చేయాలనుకున్నారు.. కానీ విపరీతం గా పెరిగింది.cbdt యే చెప్పింది నల్ల ధనం భారీ గా పెరిగిందని.592 కేసుల్లో 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారు.నోట్ల రద్దు తో నల్లధనం ఉండదని లక్ష్యం పెట్టుకుని దాంట్లో కూడా అట్టర్ ప్లాప్ అయ్యారు.నోట్ల రద్దు తో తీవ్రవాద కార్యకలాపాలు ,మాదక ద్రవ్యాల రవాణా తగ్గుతాయని భ్రమింప జేశారు.ఈ మూడో లక్ష్యం కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ప్రణాళిక లేకుండా ఆలోచన రహితంగా నోట్ల రద్దు చేశారు.దేశ ఆర్థిక వ్యవస్థ పై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది.5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది.. నోట్లు మార్చుకోవడానికి లైన్లలో నిలబడి 108 మంది మరణించారు.మరెంతో మంది పరోక్షంగా దెబ్బ తిన్నారు.62 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. కొత్త నోట్ల ముద్రణకు 21 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. ఈ మొత్తం తో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేది.నోట్ల రద్దు తో 50 రోజుల్లో అంతా బాగుంటుందని పెద్దలు భరోసా ఇచ్చారు.2 వేల రోజులైంది ఏం మార్పు తెచ్చారు?బీజేపీ వేసే ప్రతి అడుగు పేద ప్రజల పై పిడుగు లా మారింది.నీతి ఆయోగ్ నేతి బీర కాయ లో నెయ్యి చందంగా మారింది.అప్పులు చేయడం తప్పులు చేయడం బీజేపీ విధానం గా మారింది.
కేంద్రం ప్రతి రోజూ చేస్తున్న అప్పు 4618 కోట్ల రూపాయలు.ఒక కోటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మోడీ హాయం లో తెచ్చారు.రైతుల కోసం తెచ్చిన నల్ల చట్టాల పై క్షమాపణ చెప్పిన ప్రధాని నోట్ల రద్దు పై కూడా క్షమాపణ చెప్పాలి. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం తగ్గక పోగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు పై తక్షణమే శ్వేత పత్రం ప్రకటించాలి. విదేశీ మారక నిల్వలు, రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. బీజేపీ ది డొల్ల ప్రచారం.. ప్రజలను భ్రమల్లో ఉంచడం బీజేపీ విధానం.బీజేపీ వాగ్దానాల అమలు పై శ్వేత పత్రం ప్రకటించాలి.అన్నిట్లో దేశాన్ని దిగజార్చిన బీజేపీ మత పిచ్చి పెంచడం లో విజయం సాధించింది. బీజేపీ కో హాఠావో దేశ్ కో బచావో మా నినాదం.ప్రధాని మీద నమ్మకం తో అపుడు పెద్ద నోట్ల రద్దు ను సమర్ధించాము.వారు చెప్పిన లక్ష్యాలను ఆచరణలో చూపలేదు.ప్రజల కు ఎదురైన ఇబ్బందుల ను ప్రస్తావించి తీరాల్సిందే.