బిజెపితో ఒరిగేది ఏమీ లేదు… బిఆర్ఎస్ తోనే అభివృద్ధి

-కాంగ్రెస్ ఖతం అయింది.. భవిష్యత్తు భారత రాష్ట్ర సమితిదే
-బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు కండువాలు కప్పి ఆహ్వానం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్/దేవరుప్పుల: రాష్ట్రంలో దేశంలో బిజెపితో ఒరిగేదేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యే దిశలో ఉందని, భవిష్యత్తు అంతా బి అర్ ఎస్ దే నని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. అందుకే ఆయా పార్టీలోని నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల నరసయ్య, రెడ్డి రాజుల సోమయ్య లు, బి అర్ ఎస్ దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ తో కలిసి, హైదరాబాదులోని మంత్రుల నివాసంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో BRS పార్టీలో వారు జాయిన్ అయ్యారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉందని, బిజెపి పెద్దగా లేదని ఈ దశలో ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అయినా దేశంలో రాష్ట్రంలో ఆ రెండు పార్టీలతో ఒరిగేదేమీ లేదని మంత్రి చెప్పారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి పట్టం కడుతున్నారని మంత్రి అన్నారు.

కొత్తగా పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తూ వారి గౌరవం దగ్గర అన్ని రకాలుగా వారికి అండగా నిలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పార్టీలోని కార్యకర్తలు నాయకులు కొత్తగా వచ్చిన వారికి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలని ఆదేశించారు. కాగా తాము రాష్ట్రంలో కెసిఆర్ నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు చేస్తున్న అభివృద్ధి, మంచి పనులకు ఆకర్షితరమై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Leave a Reply