- రెండవ రోజు “ప్రజాదర్బార్”
- సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
అనంతపురం, జులై 31 : ఆర్థిక , వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా రెండవ రోజు “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలు, నాయకుల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను మంత్రి క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు మంత్రి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.