జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా చినరావూరు పార్క్ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.
సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ… కార్మకులందరికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ కార్మికులకు కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని వారికే ఖర్చు చేయాలి. ముఠా కార్మికులకు సంక్షేమ చట్టం తేవాలి. ఇ.పి.యస్. కనీస పెన్షన్ రూ. 9 వేలు చేయాలి. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. విశాఖ ప్రైవేటీకరణను ఆపాలి. ప్రభుత్వ సంస్థల లీజ్ (యన్.యమ్.పి) ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.