Suryaa.co.in

Andhra Pradesh

మట్టి బకాసురల నుండి బందరును కాపాడండి

– కలెక్టర్ ను కోరిన మాజీమంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్టణం : కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో మాజీమంత్రి కోల్లు రవీంద్ర మచిలీపట్నంలో జరుగుతున్న మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపై పిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్బంగా కోల్లు రవీంద్ర మాట్లాడుతూ..మచిలీపట్టణం సి.ఆర్‌.జడ్‌`1 పరిధిలోని సముద్రతీరం నుండి అక్రమంగా బీచ్‌ శాండ్‌ వలన స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవతున్న విషయం గురించి కలెక్టర్ కు ఫిరియాదు చేయడం జరిగింది.

మచిలీపట్నం మండలం మంగినపూడి, తపసిపూడి, శిరివెళ్ళపాలెం, గోపువానిపాలెం, మేకవాని పాలెం, కరగ్రహారం గ్రామ పంచాయితీల పరిధిలోని సి.ఆర్‌.జడ్‌`1 పరిధిలో వైసిపి నాయకులు అక్రమంగా వేలాది ట్రాక్కుల మట్టిని, ఇసుకను త్రవ్వి సొమ్ముచేసుకుంటున్నారు.

అధికారులందరికీ ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదు. పత్రికల్లో పేజీలు పేజీలుగా వార్తలు వచ్చినా కనీసం అక్కడ ఏం జరుగుతుందో ఎంక్వరీ చేసే నాధుడు లేడు.

సముద్రం ఆటుపోటుల నుండి గ్రామాలకు రక్షణగా వున్న ఈ మడ అడవులు, బీచ్‌ శాండ్‌, మట్టి, ఇసుకను అధికార పార్టీ వారు యథేచ్ఛగా త్రవ్వేస్తుంటే స్థానికంగా ప్రజలు భ్రయభ్రాంతులకు గురవతుఉన్నారు.

ఆటుపోటులకు సముద్రం ముందుకువస్తే తమ గ్రామాలే మొదట బలవ్వాల్సివస్తుందని వాపోతున్నారు. అధికారులకు ఎంతమందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

మంగినపూడి, తపసిపూడి, శిరివెళ్ళపాలెం, గోపువానిపాలెం, మేకవాని పాలెం, కరగ్రహారం గ్రామ పంచాయితీల పరిధిలో మట్టిని పెద్ద పెద్ద యంత్రాలను వినియోగిస్తూ ప్రతిరోజు వందలాది ట్రాప్పర్లతో తరలిస్తున్నారు.

ఈ బీచ్‌ శాండ్‌లో టిటానియం, ఇల్మెనైట్‌, రూటిల్‌, జిర్కాన్‌, సిల్లిమనైట్‌, గార్నైట్‌ వంటి అరుదైన ఖనిజసంపద నిక్షిప్తమై ఉన్నందున ఒకటన్ను బీచ్‌శాండ్‌ సుమారు 5వేల రూపాయలు చేస్తుంది, అలా ఒక ట్రిప్పర్‌కు సుమారు రూ.2 లక్షల విలువచేస్తుంది. అందుకే అధికారపార్టీ, కొంతమంది అధికారులు కుమ్మక్కై ఈ దందాను విచ్ఛలవిడిగా కొనసాగిస్తున్నారు.

కోట్లాది రూపాయల తీరప్రాంత సంపదను తరలించి సొమ్ముచేసుకుంటున్న ఈ అధికార పార్టీ నాయకులకు అడ్డుకట్ట వేసి బీచ్‌శాండ్‌ మరియు ఇసుక అక్రమ రవాణాను అపించి, దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.

దీనిపై విచారణ చేపట్టి చెర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. లేని పక్షంలో దీనిపై పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా వుంది అని కోల్లు రవీంద్ర తెలియజేసారు.

LEAVE A RESPONSE