జగన్ రెడ్డి కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే, తెలుగుజాతి ఎన్టీఆర్ కు ఇచ్చే ఘనమైన నివాళి

Spread the love

• నేటి యువత ఎన్టీఆర్ అనే గ్రంథం గురించి అమూలాగ్రం తెలుసుకోవాలి.
• పట్టుదల, పోరాటం, తెగింపు, ధైర్యం వంటి పదాలకు ప్రతిరూపం స్వర్గీయ ఎన్టీఆర్.
• ఆయనచూపిన ధైర్యసాహాసాలు, పోరాటపటిమ నరనరాల్లో జీర్ణించుకుంటేనే నేటి యువత జగన్ రెడ్డి కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడగలదు.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సరిగ్గా నేటికి 40ఏళ్లని, 40 ఏళ్ల క్రితం రాష్ట్రంలోనిపరిస్థితి, నాటిప్రజల దుస్థితి గురించి, ఎన్టీఆర్ రాకతో మారిన నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖచిత్రం, ఆంధ్రులహర్షాతిరేకాల గురించి నేటియువత క్షుణ్ణంగా తెలుసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

రాష్ట్రానికి పట్టిన జగన్ ఖర్మ పోగొట్టడమే, తెలుగుజాతి ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన నివాళి
“ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకంటే దారుణాతి దారుణమై న స్థితి నేడు జగన్ పాలనలో చూస్తున్నాం. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడానికి, కేవలం తనస్వార్థంకోసమే జగన్ రెడ్డి నేడు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. జగన్ ఏలుబడిలో తెలుగుజాతి ప్రమాదంలో పడింది. జగన్ రెడ్డిని గద్దె దించితేనే తెలుగు జాతికి పూర్వవైభవం వస్తుంది. రాష్ట్రానికి పట్టిన ఖర్మ జగన్మోహన్ రెడ్డి, ఆఖర్మను వదిలించుకోవడమే ఎన్టీఆర్ కు తెలుగు వారు ఇచ్చే నిజమైన నివాళి. ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే. ఆయనకున్న చరిత్ర, ఆయనకున్న పేరుప్రతిష్టలు పిచ్చికూతలు కూసే నీచులకు తెలియవు. రాష్ట్రంలోని యువత ఎన్టీఆర్ ను మనసారా స్మరించుకోవాల్సిన సమ యం వచ్చింది. ఆయన తెగువ, పట్టుదల, తెలుగుజాతి బాగుకోసం ఆయనపడిన తపనను నేటియువత 40ఏళ్లు వెనక్కి వెళ్లి, కచ్చితంగా తెలుసుకోవాలి. తెలుగుదేశం యువనేత నారాలోకేశ్ పాదయాత్రలో రాష్ట్రయువత పాలుపంచుకోవాలి. జగన్ రెడ్డి కబంధహస్తాల నుంచి ఏపీని రక్షించడమే మనకు మనం ఇచ్చుకునే వెలలేని కానుక అని యువత గుర్తెరగాలి.

దటీజ్ ఎన్టీఆర్…
తెలుగుజాతి చరిత్రలో నేడు ఒక సుదినం. సరిగ్గా 40ఏళ్లక్రితం ఇదేరోజు స్వర్గీయఎన్టీఆర్ లాల్ బహదూర్ స్టేడియం (ఎల్.బీ.స్టేడియం)లో ఉమ్మడిరాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీవీధుల్లో అపహాస్యం పాలవుతున్న తరుణంలో, తెలుగువారు మదరాసీలుగా పిలవబడుతూ, అవహేళనకు గురవుతున్న స్థితిలో, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో సరైన భాగస్వామ్యం లేని దుస్థితిలో, ఆంధ్రులచేత అన్న గా పిలవబడుతున్న ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9నెలల్లోనే ముఖ్యమంత్రి బాధ్యతలుచేపట్టి, కాంగ్రెస్ కబంధహస్తాలనుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపా డారు. దటీజ్ ఎన్టీఆర్ అని ప్రపంచమంతా కొనియాడబడ్డారు. రాజకీయ నేతగా ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన తొట్టతొలి ముఖ్యమంత్రి కూడా ఎన్టీఆరే. ఆనాడు ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వనివాటిని కూడా నెరవేర్చి, దేశంలోని రాజకీయపార్టీలు, నేతలు ముక్కున వేలేసుకునేలా చేశారు.

సంక్షేమ పథకాలకు దిక్సూచి ఎన్టీఆర్
సంక్షేమ పథకాలకు దేశంలోనే దిక్సూచిగా నిలిచింది ఎన్టీఆరే. పేదలకు పక్కాఇళ్లు, రూపాయికే కిలోబియ్యం, జనతావస్త్రాల పంపిణీ, భూమిశిస్తురద్దు, రైతులకు రూ.50కే 1 హర్స్ పవర్ విద్యుత్, సింగిల్ విండో విధానంలో రైతులకు రుణం, భూమిలేని పేదలకు భూవసతి కల్పించడం లాంటి గొప్పపథకాలు ఆయన ప్రవేశపెట్టినవే. రూ.30లతో పేదలకు పెన్షన్ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టింది అన్నగారే. దాన్ని తరువాత చంద్రబాబుగారు రూ.70 కి పెంచారు. రాజశేఖర్ రెడ్డి ఆ మొత్తాన్ని రూ.200లకు పెంచారు. మరలా చంద్రబాబుగారే పింఛన్ సొమ్ముని రూ. 200 నుంచి రూ.1000కి తరువాత 2వేలకు పెంచారు. రాష్ట్రంకోసం, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు నభూతో అన్నట్లు చరిత్రలో నిలిచిపోయాయు.

మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహానుభావుడు
మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆ పథకానికి తొలుత కాంగ్రెస్ అడ్డుతగిలింది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ఒక అన్నగా ఆడబిడ్డలకోసం మొండిధైర్యంతో ముందుకెళ్లారు. మహిళలకోసం ప్రత్యేకంగా తిరుపతిలో విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. అలానే వైద్యవిద్యకోసం తొలుత ప్రత్యేకవిశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. దాని పేరునే జగన్ రెడ్డి మార్చి, తనతండ్రి పేరుపెట్టుకున్నాడు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నెలకొల్పింది కూడా ఆయనే.

రామారావు రాజకీయాల్లో బడుగు, బలహీన దళితవర్గాలకు సముచితప్రాధాన్యత కల్పించారు. ఉన్నత చదువులు చదివిన లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఆయన దయవల్లే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభల్లో కాలుపెట్టారు. పేదలకోసం పోరాటం అనేది అన్న హయాంలోనే మొదలైంది. తెలుగుజాతి ఔన్నత్యంకోసం, పేదలకోసం, రాష్ట్రాభివృద్ధికోసం ఆయన తీసుకొ చ్చిన సంస్కరణలు, పథకాలు అనన్యసామాన్యం.

ఎన్టీఆర్ పాలనలో తీసుకొచ్చిన పెనుమార్పుల్ని ఒడిసిపట్టుకొని, ఆయన ప్రవేశపెట్టిన పథకాల్ని కొనసాగిస్తూనే, సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను కొత్తపుంతలు తొక్కించిన దార్శనికుడు చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్ వేసిన పునాదులపై, తెలుగువారి కీర్తిప్రతిష్టల్ని పతాకస్థాయికి చేర్చిన ప్రతిభాశాలి చంద్రబాబు” అని ఆనంద్ బాబు కొనియాడారు.

Leave a Reply