-దళితులపై దమనకాండకు నిరసనగా 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
-కడపలో దళితులపై ఇన్ని దాడులు జరుగుతుంటే కడప ఇంఛార్జ్ మినిస్టర్ గా ఆదిమూలపు సురేష్ ఏం పీకావ్?
-దళితులకే రక్షణ కల్పించలేని దళిత హోం మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
-తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్ రాజు
సిం.ఎం సొంత జిల్లా కడపలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ముఖ్యమంత్రి కనీసం స్పందిచండం లేదంటూ తెదేపా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 16 వ నెంబర్ జాతీయ రహదారిపై సి.ఎం జగన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జగన్ పాలనలో దళితులపై జరిగినన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు ఎన్నడూ జరగలేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల పులివెందులలో జంజాల కృష్ణయ్య అనే దళితుడు దారుణహత్యకు గురయ్యాడు. కడప పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డిప్యూటీ డైరక్టర్ గా పనిచేసిన డా. అచ్చెన్నను వేధించి హతమార్చారు. అంతకు ముందు పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. దళితులపై అత్యంత ఘోరంగా, పాశవికంగా దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదు.
దళిత హోం మంత్రి ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి భజన చేయడం తప్ప ప్రజల బాగోగులు చూసే పరిస్థితి లేదు. యర్రగొండపాలెంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ముందు చొక్కా విడిచి హల్ చల్ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ కడప ఇంఛార్జ్ మినిస్టర్ గా ఉండి ఏం చేస్తున్నారు.?
సిఎం సొంత జిల్లాలోనే ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు?. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దళితులపై 6 వేలకు పైగా దాడులు జరిగాయి. వైకాపాలో ఉన్న ఒక్క దళిత నాయకుడి నోరు విప్పడం లేదు. వైకాపా దళిత నాయకులను దళిత సమాజం దోషులుగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి. దళితులకే రక్షణ కల్పించలేని దళిత హోం మంత్రి వెంటనే రాజీనామా చేయాలి