జర్మనీలో వరుసగా ఏడవ వారం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మ్యూనిచ్ నగరంలోని ప్రతిష్టాత్మక కార్ల్స్ సెంటర్ లో ఎన్ఆర్ఐ లు చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఆర్ఐల ప్రదర్శనను స్థానికులు ఆసక్తిగా గమనించారు. వారికి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అప్రజాస్వామిక పరిస్థితులను ఎన్ఆర్ఐలు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవప్మెంట్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పొంది ఉద్యోగం సంపాదించిన రవికిరణ్ అనే యువకుడు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.