- నీలాంటి చెత్త వెదవల వీడియోలు ఫార్వర్డ్ చేసే తీరిక లేదు
- రేప్ లు, దోపిడీలు చేసినోళ్లకు వైసిపిలో శాశ్వత సభ్యత్వం!
- మాధవ్ వీడియోలు బహిర్గతం చేసింది వైసిపి నేతలే
- గజదొంగ సీటెక్కిన రోజే సోషల్ మీడియాలో మాధవ్ దరిద్రం
- తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ
అమరావతి: తనపై ఎంపి గోరంట్ల మాధవ్ చేసిన ఆరోపణలకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ అందరి మాదిరిగానే తాను నిన్నటిరోజు నిద్రలేచే సరికి ఎంపి మాధవ్ తాలూకూ దరిద్రపు వీడియో కళ్లముందు కన్పించిందని తెలిపారు. లక్షకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైసిపికి శాశ్వత అధ్యక్షుడయ్యారని, వైసిపిలో శాశ్వత సభ్యత్వానికి మర్ఢర్, రేప్, దోపిడీ వంటివి అర్హతలని అన్నారు. ఎంపి మాధవ్ తన పేరు ప్రస్తావించినట్లు కొందరు స్నేహితులు ఉదయం 10గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. వీడియో సందేశంలో వంశీ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…!
“కమ్మ నాయళ్లు అని మాధవ్ నోరు పారేసుకున్నారు…ఎస్… నేను కమ్మకులస్తుడనే. అయితే చింతకాయల విజయ్ ఏ కులమో కూడా నీకు తెలియదు. నీ దరిద్రాన్ని వీడియో తీసుకోవడానికి నీకు టైమ్ ఉన్నా వాటిని ఫార్వర్డ్ చేసే టైమ్ మాకు లేదు. నెలరోజుల కిందట జగన్ రెడ్డి తొత్తులుగా మారిన కొందరు పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి గాయపర్చారు… అప్పటినుంచి నేను వైద్యం చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నా. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కులం చూడం, మతం చూడం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు… ఆ పార్టీనేతలేమో నిద్రలేస్తే కులప్రస్థావన తెస్తూ ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మిస్టర్ మాధవ్… ప్రభుత్వం మీ చేతిలో ఉంది…నీ ఇష్టమొచ్చిన వారితో విచారణ చేయించి మేము తప్పుచేశామని నిరూపించు. ఒకవేళ అలా నిరూపించలేక ఎంపి పదవికి రాజీనామా చేయ్. నీలాంటి వెదవల బాగోతాలు ప్రతిఒక్కటీ బయటపెట్టి తీరుతాం.
నీ స్వగ్రామం రుద్రవరంలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె బిడ్డను చంపినట్లు ఆరోపణలున్నాయి. దానిపై కూడా విచారణ జరపాలి. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేవు, పేదలకు కేంద్రం పంపిన రేషన్ ఇవ్వకపోవడంతో ఇటీవలే తీవ్రంగా మందలించింది. వాటన్నింటి నుంచి దారిమళ్లించేందుకు నీ లాంటి వారి వీడియోలను మీ పార్టీవారే సోషల్ మీడియాలో వదులుతున్నారు. మాధవ్ లాంటి వాడికి మద్దతు ఇస్తే వైసిపినేతలు తర్వాత బాధపడతారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో 16నెలలు చిప్పకూడు తిన్నఎ2 విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభ చైర్మన్ సీటులో కూర్చున్నారు.
గజదొంగ విజయసాయి ఆ సీటులో కూర్చున్న రోజే మాధవ్ ఘోరాన్ని రాష్ట్రప్రజలు చూడాల్సి వచ్చింది. మాధవ్ తాలూకు న్యూడ్ వీడియోను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిజాలను నిగ్గుతేలుస్తాం. నేను నారా లోకేష్ అనుచరుణ్ణి. తెలుగుయువత అధికార ప్రతినిధిని” అంటూ బండారు వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.