-భారాస ఎపి అధ్యక్షుడు డాక్టర్ తోట
హైదారాబాద్ లో నిర్మించ తలపెట్టిన కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారమందేలా తోడ్పాటునందించాలని ఎపి బిఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు .ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు.ఈ నెల 25న ఇదే అంశంపై సిఎం కేసిఆర్ ను తోట చంద్రశేఖర్ నేతృత్వంలో విశ్రాంత అఖిల భారత సర్వీస్ అధికారుల బృందం రాజకీయాలకతీతంగా కలసిన సంగతి విధితమే.
కాపు సంక్షేమ భవన్ నిర్మాణానికి సిఎం సానుకూలంగా స్పందించి భవన నిర్మాణానికి అవసరమైన నిధులు, స్థల కేటాయింపు కు సహకరిస్తామని విశ్రాంత అధికారుల బృందానికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సిఎస్ శాంతి కుమారి కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం తరపున త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ తోట తెలిపారు.