Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థులకు బోధనా సామాగ్రి అందచేత

ముదినేపల్లి: మండలంలోని పెదపాలపర్రు ఈదర శోభనాద్రి చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు, 1987 సంవత్సరం పదవతరగతి పూర్వ విద్యార్థులు (గోల్డెన్ ఫ్రెండ్స్) శనివారం బోధనా సామాగ్రి అంద చేసారు. దివంగత బొప్పన బాబురావు చారిటీస్ తరుపున, అన్విత గ్రూప్ సీఎండి బొప్పన అత్యుత రావు వీటిని సమకూర్చగా సంస్థ డైరెక్టర్, 1987 బ్యాచ్ విద్యార్థి నాగభూషణం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంత కుమారికి వీటిని అందచేశారు. పదవ తరగతి విద్యార్థులు అందరికీ పరీక్షలకు ఉపకరించేలా అట్ట, జామెంట్రి బాక్స్ అందించటమే కాక, సాయంత్రం స్టడీ అవర్స్ కు ఉపయోగపడేలా అదనపు విద్యుత్ సౌకర్యం, దీపాలు సమకూర్చారు. కార్యక్రమంలో పెదపాలపర్రు సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బొప్పన ప్రసాద్, ఈదర సీతారామయ్య, బొప్పన శ్రీనివాస్ (హిందూ), ఫణి ఆనంద్ (యూఎస్ఏ) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE