– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య. చూపు పడితే పచ్చని పంట పొలాలు ఎండిపోతాయి. అడుగుపెడితే నిండుగా ఉన్న డ్యాముల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అయిపోతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరువుకి బ్రాండ్ అంబాసిడర్, దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ సైకో జగన్. వందేళ్ల చరిత్రలో అతి తక్కువ వర్షపాతం నమోదై రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది.
సాగునీరో జగన్ మహాప్రభో అని రైతులు గగ్గోలు పెడుతుంటే, తాడేపల్లి కొంపలో నీరో చక్రవర్తిలాగా ఇసుక-లిక్కర్ లెక్కలు వేసుకుంటూ, రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగితేలుతున్నాడు. ఒక్క చాన్స్ ఇచ్చిన ఖర్మానికి వరి వేసిన రైతుకి ఉరి, పంటలు వేసిన అన్నదాతలకి మిగిలింది గుండె మంటలు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఎండిన పంట చూసి ఆందోళనతో చేలోనే ఉరి వేసుకుంటామంటోన్న రైతుల గోడు వినపడదా! కర్నూలు జిల్లా ఉరుకుంద వద్ద సాగునీటి కోసం అధికారుల కాళ్లపై పడిన రైతులు ఆందోళన పట్టదా! శ్రీకాకుళం జిల్లా గార మండలంలో వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లతో ఎండిన వరి పంటకి నిప్పు పెట్టిన రైతన్నల ఆగ్రహ జ్వాలలు కనపడవా! తాడేపల్లి నీరో చక్రవర్తికి..