– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
గుంటూరు: సైకో జగన్ తన తప్పుడు వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తండ్రి వయసున్న చంద్రబాబు మీద పదే పదే చావాలి, కాల్చి చంపాలి, బావిలో దూకి చావాలి, వయస్సు అయిపోయింది రేపో మాపో పోతాడు లాంటి సిగ్గులేని వ్యాఖ్యలు మానాలని హితవు పలకాలి. రాజకీయం కోసం బాబాయిని చంపి, ఆస్తుల కోసం తల్లిని చెల్లిని కోర్టులకు లాగిన నీచ రాజకీయ నాయకుడు దేశంలోనే జగన్ ఒక్కడేనని ఆయన విమర్శించారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే… జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో స్థానం లేదు, అధికారం నుండి ప్రజలు మట్టుబెట్టినా బుద్ధి రాలేదు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధిలకు ఓర్వలేక ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు.
జగన్ మొసలి కన్నీరు నమ్మే స్థితిలో రైతులు లేరు. కౌలు రైతులు ఆత్మహత్యలలో దేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రాను తీసుకెళ్లిన రైతు ద్రోహి జగన్. జగన్ ప్రభుత్వ హయాం కంటే లక్ష టన్నుల ఎక్కువ యూరియా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. 2022లో కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి నల్ల మార్కెట్ నడిపి రైతు భరోసా కేంద్రాలను దోపిడి కేంద్రాలుగా చేసిన దోపిడి దొంగ జగన్. నకిలీ విత్తనాలు, సొసైటీల కుంభకోణాలు, రైతు ఇన్సూరెన్స్ ఎగవేత, పంట నష్టం ఎగవేత, ధాన్యం డబ్బులు ఎగవేత ఒక్కటి కాదు అన్ని రకాలుగా రైతుని వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన జగన్ రైతుల మీద కపట ప్రేమ చూపటం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బడుగు బలహీన వర్గాల నేత కింజరాపు అచ్చెన్నాయుడు మీద జగన్ చేసిన అనుచిత వ్యాఖలకు క్షమాపణ చెప్పాలి, సిగ్గు లేని రాజకీయాలు, ఫ్యాక్షన్ పనులు, ఫ్యాక్షన్ మనస్థత్వం వదలాలి.