Suryaa.co.in

Andhra Pradesh

సైకో పాలన పోతుంది…ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది

-నన్ను ఆదరించిన ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట, మాజీ ఎమ్మెల్యేలు గరటయ్య, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి

అమరావతి :- రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సైకో పాలన పోయి…ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం తనను ఆదరించిన ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, తనయుడు మాగుంట రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ….‘‘ఈ రోజు ఒక శుభ దినం..ఎన్నికల కోడ్ వచ్చింది…ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదు. ఆదివారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేటలో బహిరంగ సభతో చరిత్ర సృష్టించబోతున్నాం. రాష్ట్రంలో నిన్నటి దాకా ప్రతి ఒక్కరూ భయపడ్డారు. నా లాంటి వాడు తెగించాడు…నేను కూడా బయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేరు.

ఒంగోలు ఎంపీ స్థానంలో టీడీపీదే గెలుపు
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాకతో జిల్లాలో రాజకీయ తిరగబడింది. ఒంగోలు ఎంపీ స్థానంలో గెలుపు టీడీపీదే కాబోతోంది. దర్శి నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థిని త్వరలోనే నియమిస్తాం.’ అని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE