Suryaa.co.in

Andhra Pradesh

ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత

– ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మీద మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తోందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యం, వారి బాగోగులు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిబద్ధతకు ఈ గణాంకాలే నిదర్శనమని అన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్
ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ పే స్కేలు ప్రకారం జీతాలు అందుకోనున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఉద్యోగుల దీర్ఘ కాలిక డిమాండును నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పే స్కేలును కూడా వర్తింపజేయడంతో దాదాపు 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.360 కోట్లు అదనపు ఆర్థిక భారం పడుతుందని, జీతాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.3.960 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు.

LEAVE A RESPONSE