-కేసీఆర్ తెలంగాణ తేకుంటే రేవంత్ సీఎం కాదు చెప్రాసీ కూడా కాడు
-కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ
-రేవంత్ రెడ్డి ది చీటర్స్ ఫ్యామిలీ
– తెలంగాణ చెట్టు తల్లి వేరు కేసీఆర్
-పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదు వటవృక్షం
-నాటి దీక్షాదివస్ స్వరాష్ట్రం సాధించిన దివ్యాస్త్రం
-మళ్లీ వచ్చేది కేసీఆరేనంటూ ప్రజావాక్కు
-నిజామాబాద్ ‘దీక్షాదివస్’లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
-పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ దండు
నిజామాబాద్: తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చెట్టు తల్లి వేరు లాంటివారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించిన ‘దీక్షాదివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదని, వటవృక్షమని స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఏదో పీకుతామని శపధాలు చేసిన వైఎస్ , చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి జెండాలు పీక్కోని పోయారు.
తెలం గాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేమన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ది ఎప్పటికీ చేరిపేయలేని సంతకమన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరివల్ల కాదన్నారు.కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన ‘ దీక్షా దివస్ ‘ చరిత్రలో చెరిగిపోని సంతకం.
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన దమ్మున్న నేత కేసీఆర్.తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో
నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది.ఇది స్వరాష్ట్ర కల సాకారానికి పునాది పడిన రోజు. కేసీఆర్ దీక్ష సూర్య చంద్రులున్నంత వరకూ నిలిచిపోయే శుభదినం . కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను,36 పార్టీలను ఒప్పించి, మెప్పించి రాష్ట్రం సాధించిన గొప్ప ఉద్యమ నేత కేసీఆర్.
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చింది. చిట్టినాయుడి అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు.కేసీఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ. నేడు కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభ తెలంగాణ. అబద్దాల హామీలిచ్చి కాంగ్రెస్ కు ఓట్లెయాలని దండంపెట్టి నేడు
అమలు చేయలేక ఆ హామీలకు పిండం పెడుతున్నారు. కొడంగల్ ప్రజలే రేవంత్ రెడ్డి పై తిరగబడుతుండ్రు. గురుకులాల్లో పురుగులభోజనం , ఇప్పటికే 48మంది పిల్లల మృతి. విద్యార్థుల స్కాలర్ షిప్పులు గోవిందా. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల గగ్గోలు. ఉద్యమ బాటలోఆశాలు, అంగన్ వాడీలు , ప్రభుత్వ ఉద్యోగులు. నిధుల కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టిండ్రు. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు రణభేరి మోగిస్తున్నారు. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితుల హాహాకారాలు చేస్తున్నారు.
మూసీ పరివాహక నివాసితుల శాపనార్థాలు పెడుతుండ్రు. చివరకు పోలీసులు కూడా రోడ్ల పాలయ్యారు. కల్యాణ లక్ష్మీకి కాలదోషం పట్టింది.తులం బంగారం ఊసేలేదు. మహాలక్ష్మి పథకం అటకెక్కింది. నిరుద్యోగ భృతి నిల్. ఇలా నువ్వు మోసం చేయని ప్రజలెవరయినా ఉన్నారా?.రేవంత్ రెడ్డి ను తిట్టని వారెవరైనా ఉన్నారా?. నమ్మి ఓటేసినందుకు అందరినీ నట్టేట ముంచినవు. బీఆర్ఎస్ ది, కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ. రేవంత్ ది చీటర్స్ ఫ్యామిలీ. కాంగ్రెస్ ది అవినీతి ఫ్యామిలీ.
సీఎం రేవంత్ రెడ్డి ఒక బుడ్డరుఖాన్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ సీఎం కాదు కదా చెప్రాసీ కూడా అయివుండేవాడు కాదన్నారు. ఇక్కడి బుడ్డరు ఖాన్ పీసీసీ అధ్యక్షుడు కాలేడు. బీఆర్ఎస్ ది 60లక్షల సైన్యం. మా కార్యకర్తలు వ్యక్తులు కాదు మహాశక్తులు. కేసీఆర్ 500కే వీ ట్రాన్స్ ఫార్మర్ అయితే మా కార్యకర్తలు 3-పేజ్ కరెంటు. పోలీసు కేసులకు బయపడం. కాంగ్రెస్ కు ఊడిగం చేస్తున్న పోలీసు అధికారుల పేర్లు పింక్ బుక్ లో రాస్తున్నాం. వచ్చేది మళ్లీ గులాబీ రాజ్యమే. ఎవరినీ వదిలిపెట్టం అని జీవన్ రెడ్డి అన్నారు.