Suryaa.co.in

Telangana

కొన్ని పార్టీ లకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైంది

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణలో కొన్ని పార్టీలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, దేశంలో ఏ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నారో చెప్పాలని తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సవాల్ చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలసి మీడియాతో మాట్లాడిన తలసాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. తలసాని ఏమన్నారంటే… అప్పట్లో తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు ఉండేవి కరెంటు సమస్య ఉండేది. అసెంబ్లీ సమావేశాల్లో ఇవే అంశాలు ప్రధానంగా ఉండేవి.

ఏ రాష్ట్రం లో తెలంగాణ లాగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారో ప్రతిపక్షాలు చెప్ప గలవా నేను ఛాలెంజ్ చేస్తున్నా.సాగునీరు తాగు నీరు కు అల్లాడిన తెలంగాణ ను తన చతురత తో అగ్ర భాగాన నిలబెట్టింది కేసీఆర్ కాదా?రైతులకు ఇస్తున్న సదుపాయాల కారణంగా పంట దిగుబడులు భారీ గా పెరిగాయి.ఆహార భద్రత చట్టం ప్రకారం ధాన్యం సేకరణ కేంద్రం భాద్యత.

పీయూష్ గోయల్ తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచిన తీరు బాధాకరం..
తెలంగాణ బీజేపీ నేతలకు పీయూష్ వాస్తవాలు చెప్పరా… వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యూపీ ఎన్నికల్లో ఒడిపోతామని తెలిసే సాగు చట్టాలు ఉపసంహరించుకున్నారు. మళ్లీ సాగు చట్టాలు తెస్తామని మరో కేంద్ర మంత్రి చెబుతున్నారు.

బీజేపీ లో ఒక్కో నాయకుడి తీరు ఒక్కో రకంగా ఉంది. మరొకడు వరి కచితంగా వేయాలని చెబుతుంటాడు. నిరుద్యోగ దీక్ష పేరిట బీజేపీ డ్రామా ఆడుతోంది. దమ్ముంటే కేంద్ర ఉద్యోగాలపై శ్వేత పత్రం ప్రకటించాలి. బీజేపీ మేనిఫెస్టో లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది. ఏమయ్యాయి?కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ కు అవార్డులు ప్రకటిస్తున్న సంగతి బీజేపీ మూర్ఖులకు తెలియదా? కల్యాణ లక్ష్మీ లాంటి పథకం దేశం లో తెలంగాణ తప్ప మరెక్కడైన ఉందా? శాంతి భద్రతలు ఇంత బాగా వేరే రాష్ట్రం లో ఎక్కడైనా ఉన్నాయా?ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో తెలంగాణే ముందంజ లో ఉంది. పల్లెల్లో పార్కులు తెలంగాణ తరహాలో మరెక్కడైన ఉన్నాయా?

కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కొందరు అంటారు. వారిని ఎవరైనా నామినేట్ చేశారా… ప్రజలు ఎన్నుకుంటే గెలిచారు.ప్రజాస్వామ్యం పేరిట సీఎం అనే గౌరవం లేకుండా కొందరు ఏక వచన సంభోధన చేస్తున్నారు. కే టీ ఆర్ కుమారుడిని కూడా విమర్శించే నీచ స్థాయికి దిగారు.మాకు తిట్టడం చేతకాదనుకుంటున్నారా.. ఇక నైనా పద్దతిగా ఉండండి.ఒకడు నిరుద్యోగ దీక్ష అంటాడు.. మరొకడు ఎర్రవల్లి వెళతా అంటాడు. ఎర్రవల్లి పోయి ఏం చేస్తాడు.ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రతిపక్షాలకు ఏం చేతకాదు. నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు సరైన రీతిలో బుద్ది చెబుతారు.

బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ కు పంజాబ్ లొనే దిక్కు లేదు.. ఇక్కడొచ్చి ఎదో చేస్తానని మాట్లాడుతున్నారు. ఇక్కడి జాతీయ పార్టీ ల్లోఉంటున్న నేతలకు కేంద్రం తో ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వం కచితంగా ధాన్యాన్ని కొనాల్సిందే.రైతుల ప్రయోజనాల కోసం ఏం చేయాలో మాకు తెలుసు. 70 ఏండ్లలో ఏ పార్టీ సాధించనిది టీ ఆర్ ఎస్ ఈ ఏడేండ్లలో తెలంగాణ అభివృద్ధి విషయం లో సాధించింది.
తెలంగాణ కు మేలు చేయడమే టీ ఆర్ ఎస్ పని.బాధ్యతాయుత పదవి లో ఉండి రేవంత్ రెడ్డి అసభ్య పద జాలం వాడుతున్నారు.జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు గా ఉంటుంది బండి సంజయ్ రేవంత్ ల తీరు.

తెలంగాణ కన్నా వేరే రాష్ట్రాల్లో పథకాలు బాగా అమలు జరుగుతున్నాయని కాంగ్రెస్ బీజేపీ లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.తెలంగాణకు నిధులు ఇవ్వరు గానీ అవార్డులు మాత్రం ఇస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ లు డ్రామా కంపెనీ లుగా మారిపోయాయి.. మీడియాలో ఫోటో ల కోసమే ఆ నాయకుల ఆరాటం. కేసీఆర్ వరి పండిస్తే తప్పేమిటి.. ఆయన పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నపుడు అడగాలి. టీ ఆర్ ఎస్ ఎంపీ లు ధాన్యం సేకరణ కోసం ఢిల్లీ లో పోరాడితే కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఎక్కడున్నారు?

తెలంగాణ లో ధాన్యం పండిస్తే కేంద్రం గర్వంగా ఫీలవ్వాలి. పండించిన ధాన్యాన్ని కొనం అని అనడం ఆహార భద్రత చట్టానికి విరుద్ధం కాదా? యూపీ లో ఎన్నికలున్నాయనే అక్కడ కేంద్రం ప్రాజెక్టులను ప్రకటిస్తోంది.తెలంగాణ కు మాత్రం మొండి చేయి చూపుతోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటములతో పోలిస్తే టీ ఆర్ ఎస్ గెలుపు శాతమే ఎక్కువ. పీఎం మోడీ నియోజకవర్గం ఎమ్మెల్సీ సీటు లో బీజేపీ ఓడి పోలేదా?

LEAVE A RESPONSE