Suryaa.co.in

Features

ఒక పుల్లారెడ్డి…ఒక రామోజీరావు… ఒక భాష్యం రామకృష్ణ

– విరామం లేని కష్టమే వాళ్లను గొప్పవాళ్ళని చేసింది

ఒక రంగాన్ని ఎంచుకొని, నిజాయితీగా కొన్నాళ్లు కష్టపడి పనిచేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. కానీ ఆ అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి అంతకన్నా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది.

తెలుగు దినపత్రికల చరిత్రలో ఈనాడు దినపత్రిక ప్రారంభం ఒక సంచలనం. అనతి కాలంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అయితే….దాదాపు అసాధ్యమైన విషయం ఏంటంటే….గత 49 సంవత్సరాలుగా తెలుగు దినపత్రికలలో ఈనాడు పత్రికదే మొదటి స్థానం.
శ్రీమంతుడు సినిమాలో ఒక సన్నివేశంలో అన్నదమ్ముల అనుబంధం గురించి హీరో చెబుతాడు….40 ఇయర్స్…ఇట్స్ అమేజింగ్…చూస్తూ ఉందాం… ఇంకా 40 సంవత్సరాలు వాళ్ళు కలిసే ఉంటారని.

సరిగ్గా అలాగే…తెలుగు సమాజం అలా చూస్తూ ఉండగానే ఈనాడు దినపత్రిక 100 సంవత్సరాల పూర్తి చేసుకోవచ్చు.

38 సంవత్సరాలుగా ఈనాడు సంస్థలో పనిచేస్తున్న, ప్రస్తుత ఎడిటర్ రామోజీరావు గారి ఆత్మకథలాంటి పుస్తకం రాసిన నాగేశ్వరరావు గారితో, ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఈనాడు కార్యాలయంలో మాట్లాడుతున్నప్పుడు….రామోజీరావు గారి నిబద్ధత గురించి ఆయన చెప్పిన ఒక విషయం విని నేను నిర్ధాంత పోయాను.

అదేంటంటే….
మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించిన తొలి రోజుల్లో…రామోజీరావు గారి మరో వ్యాపారమైన ఇమేజెస్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆయన భార్య రమాదేవి గారు….తన జీతాన్ని పొదుపు చేయడానికి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక బ్రాంచ్ లో ఒక చిట్ గ్రూపులో జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత చిట్ పాడుకొని డబ్బు తీసుకున్నారు.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత,ఆ బ్రాంచ్ మేనేజర్ ఒక పనిమీద రామోజీరావు గారిని కలిశారు.
మాటల మధ్యలో,ఆ మేనేజర్…
కాస్త సంతోషంతో కూడిన గర్వంతో…మేడం గారు మా బ్రాంచ్ లో చిట్ వేశారు,ఈ మధ్యనే పాడుకొని డబ్బు తీసుకున్నారు…. అని చెప్పాడు.
మరుక్షణం…రామోజీరావు గారి నోటి నుంచి దూసుకు వచ్చిన ప్రశ్న… ఆ మేనేజర్ కి అర్థం కావటానికి….దాదాపు నిమిషం పట్టింది.
తన భార్య కూడా మార్గదర్శిలో చిట్ వేసి,పాడుకుని,డబ్బు తీసుకున్నారని మేనేజర్ చెప్పిన వెంటనే…. రామోజీరావు గారి నోటి వెంట దూసుకొచ్చిన ఆ ప్రశ్న….

షూరిటీలు తీసుకున్నారా?

ఒక పుల్లారెడ్డి…
ఒక రామోజీరావు…
ఒక భాష్యం రామకృష్ణ…….
రాత్రికి రాత్రి గొప్పవాళ్ళు కాలేదు…..
దశాబ్దాల….విరామం లేని కష్టమే వాళ్లను గొప్పవాళ్ళని చేసింది.

వాళ్ళ కష్టాన్ని కాకుండా…..కులాన్ని మాత్రమే చూసే వాళ్ళు…..కోటీ లో 222 నంబర్ బస్సు ఎక్కి, ….లకడికపూల్‌,ఖైరతాబాద్,ఎర్రమంజిల్ దాటిన తర్వాత పంజాగుట్టలో లెఫ్ట్ తిరిగాక నాగార్జున సర్కిల్,టీవీ9, సాగర్ సొసైటీ దాటిన తర్వాత స్టేజిలో దిగితే…ఆ ఎదురుగా…ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఉంటుంది. దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ చాలామంది వస్తా ఉంటారు.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE