Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్ రెడ్డికి చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు

-జగన్ అధికారంలోకి వచ్చాక 2022లో పవర్ హాలిడే
-రోజుకు 40-40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత
-విద్యుత్ ఛార్జీల పెంపుతో 1.47 కోట్ల కుటుంబాలపై భారం
-సైకో జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు
-విద్యుత్ కోతలు, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం, ప్రభుత్వ దోపిడీపై మాజీమంత్రి , టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ 

వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని., విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తెదేపా హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి, దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని కన్నా తెలిపారు.2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే, 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు.జగన్ అధికారంలోకి వచ్చాక 2022లో పవర్ హాలిడే ప్రకటించారని… 2022 ఏప్రిల్ లో రోజుకు 40-40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని కన్నా విమర్శించారు.

తక్కువ ఓల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రైతులకు 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయడంలో వైకాపా విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనీసం 3-4 గంటల విద్యుత్ కూడా అందడం లేదని అన్నారు…

వైఎస్ అవినాష్ రెడ్డికి చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేశారని… ఆ పరికరాల వల్ల విద్యుత్ కోతలు, లో-ఓల్టేజీ విద్యుత్ సరఫరా సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆదాయం 2022లో రెండింతలు పెరిగి రూ.1350 కోట్లకు చేరిందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో 1.47 కోట్ల కుటుంబాలపై భారం మోపారని తెలిపారు.

2016 నాటికి గుజరాత్ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు, 100 శాతం విద్యుత్ సరఫరా చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని… తెదేపా ప్రభుత్వంలో 38 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇస్తే.. వైకాపా ప్రభుత్వం కేవలం 8 లక్షల కనెక్షన్లతో సరిపెట్టిందని ఎద్దేవా చేశారు.

2014లో 9,529 మెగావాట్లు ఉన్న ఇన్ స్టాల్డ్ కెపాసిటీని 24,184 మెగావాట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని.. జగన్ మూడేళ్లలో పెంచింది కేవలం 910 మెగావాట్లేనని కన్నా తెలిపారు. తెదేపా ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీపై ఒక్క రూపాయి కూడా పెంచలేదని… సైకో జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పారు.

LEAVE A RESPONSE