Suryaa.co.in

Andhra Pradesh

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గతంలో కమలాపురం మున్సిపల్ కమిషనర్ గా కూడా మునికుమార్ పని చేశారు.

LEAVE A RESPONSE