Suryaa.co.in

Telangana

పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకేజీ

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక విషయం బయటపడింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌తో పాటు పేపర్‌ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

అంతేకాకుండా ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేశారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో కనిపిస్తోంది.

LEAVE A RESPONSE