Suryaa.co.in

Andhra Pradesh

క్విట్‌ చంద్రబాబు…క్విట్‌ తెలుగుదేశం పార్టీ

-ఇదీ ఇప్పుడున్న వాస్తవ రాజకీయ పరిస్థితి
-చంద్రబాబుకు జవసత్వాలన్నీ అయిపోయాయి
-ఏనాడో ఉద్ధరించానని చెబితే ఎవ్వరూ పట్టించుకోరు
-చంద్రబాబు తనకంటూ ఒక్క పేటెంట్‌ చెప్పగలరా
-ఏ ఒక్క వర్గానికైనా ఆయన మేలు చేశారా?
-సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు
-ఆయన ఏనాడూ తన మంత్రివర్గంలో ఆ ప్రాతినిథ్యం ఇవ్వలేదు
-రాజ్యసభ టికెట్లూ క్యాష్‌ పార్టీల వారికే ఇచ్చాడు
-చివరకు పార్టీకి సేవ చేసిన వారికి కూడా ఇవ్వలేదు
-పవన్‌కళ్యాణ్‌ అజ్ఞానం చూస్తుంటే జాలేస్తుంది
-జిల్లాల ఏర్పాటులోనూ 30 రోజుల గడువు ఇచ్చాం
-తుని ఘటనకు మేమే బాధ్యులమని అసత్య ఆరోపణ
-పవన్‌ వెంటనే తన వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకోవాలి
-మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌

విజయనగరం: మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..:
క్విట్‌ చంద్రబాబు:
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జవసత్వాలు అయిపోయాయి. అందుకే క్విట్‌ చంద్రబాబు. క్విట్‌ టీడీపీ అంటే బాగుంటుంది. ఆయన జవసత్వాలు పోయాయి. ఏదో తాతల నాడు నేతులు తాగాను. ఉద్ధరించాను అంటే అది కాదు. ఇప్పుడైనా సరే, చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నా తాలూకా ప్రోగ్రామ్‌ ఇది. నా పేటెంట్‌ ఇది. నేను దీనికి ఛాంపియన్‌ను. నా ప్రభుత్వ హయాంలోనే నేను ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. రాష్ట్రానికి మేలు జరిగింది. సామాన్య ప్రజలకు మంచి జరిగింది. ఈ విధానం ద్వారా రైతాంగానికి ఆర్థికంగా చేయూతనిచ్చాను. అందరి జీవన ప్రమాణాలు పెంచాను అని చెప్పడానికి కనీసం ఒక్క ప్రోగ్రామ్‌ అయినా ఉందా?
మరి ఆయనను ఎవరు కోరుకుంటారు? ఆయనను రమ్మని ఎవరు బ్యాండ్‌ మేళాలతో స్వాగతం చెబుతారు. ఎప్పుడు ఈ దరిద్రం పోతుందా అని చూస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అయితే అతివృష్టి. లేదా అనావృష్టి. అది ఆయనకు ఉన్న శాశ్వత ముద్ర.

ఆయనకు ఆ అర్హత లేదు:
మాకు బస్సు యాత్ర అర్హత లేదా? మొత్తం 25 మంతుల్లో 17 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉంటే సామాజిక న్యాయం జరిగినట్లు కాదా? మేమంతా ఆయన సామాజికవర్గమా? లేక ముఖ్యమంత్రి సామాజికవర్గమా? చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇలా ఎందుకు పదవులు ఇవ్వలేదు. ఆయన సామాజిక న్యాయం చేయలేదు? ఎందుకు చేయలేకపోయాడు?
విజయనగరం జిల్లాలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ గతంలో ఇక్కడ మంత్రులుగా ఎవరున్నారు. విజయనగరం రాజు లేదా బొబ్బిలి రాజు. ఇది ధర్మమేనా? ప్రజలు ఊర్కుంటారా? తిరగబడరా?
నేను దీన్ని పట్టించుకోను. కానీ సామాన్య ప్రజలు ఆలోచిస్తారు కదా? చంద్రబాబా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది?

రాజ్యసభ టికెట్లు ఎవరికిచ్చారు?:
రాజ్యసభలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి చంద్రబాబు ఏనాడూ ప్రాతినిథ్యం కల్పించలేదు. ఎంతసేపూ క్యాష్‌ పార్టీలకే ఇచ్చాడు. కనీసం పార్టీ కోసం పని చేసిన వారికైనా ఇచ్చాడా? చివరకు వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి, ఆ పని చేయలేదు.

రాక్షస మనస్తత్వం:
అమలాపురం ఘటనల్లో మా పార్టీ ప్రమేయం ఉందని చెప్పడానికి సిగ్గు పడాలి. ఆ దాడుల వెనక ఎవరెవరున్నారనేది రెండు మూడు రోజుల్లో అన్నీ తెలుస్తాయి. అన్ని కోణాలు బయటకు వస్తాయి. వారి ఉద్దేశం ఏమిటంటే, అక్కడ కాల్పులు జరగాలి. కొట్లాటలు, లాఠీ ఛార్జీలు జరగాలి. ఇద్దరు ముగ్గురు చనిపోవాలి. రాక్షస మనస్తత్వం. దుర్మార్గమైన ఆలోచన. కానీ అవన్నింటినీ అడ్డుకుని ఒక శాంతియుత వాతావరణం తీసుకొచ్చాం. ఇప్పటికే 72 మందిని అరెస్టు చేశాం.

పవన్‌కు పరిజ్ఞానం లేదు:
జిల్లాల పేరు మార్పుకు 30 రోజుల గడువు అనేది 26 జిల్లాలు చేసినప్పుడు కూడా ఇచ్చాం. అలాగే పలు జిల్లాలకు కొత్తగా పేర్లు పెట్టాం. అల్లూరి సీతారామరాజు జిల్లా, సత్యసాయి జిల్లా అని దాదాపు ఏడు జిల్లాలకు కొత్త పేర్లు పెట్టాం. పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే జాలి వేస్తుంది. ఎందుకంటే ఆయనకు విషయాలు తెలియవు.

ఆ వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకోవాలి:
తుని సంఘటనలోనూ మా ప్రమేయం ఉందని పవన్‌కళ్యాణ్‌ ఆరోపించారు. నిజానికి ఆ ఘటనలో ముద్దాయిలు ఎవరు? ఛార్జ్‌షీట్‌ ఎవరిపై పెట్టారు. ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు, నాపేరు, సి.రామచంద్రయ్య పేర్లు పెట్టారు. నేను, సి.రామచంద్రయ్య ఈ పార్టీలో ఉన్నాం. మరి ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు ఏయే పార్టీల్లో ఉన్నారు.
పవన్‌కళ్యాణ్‌ అలా మాట్లాడడానికి సిగ్గు పడాలి. ఆయన ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకోవాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను.

LEAVE A RESPONSE