జనగణమన
అధినాయక జయహే
భారత భాగ్యవిధాత..
ఆలపిస్తున్నంతనే ఉప్పొంగే జాతీయ భావం…
దేశ సమైక్యతా రావం..
విశ్వకవి విరచితం..
అక్షరం అక్షరం వీరోచితం..!
మహోన్నత భరత భూమిని
ముందుకు నడిపించే జాతీయగీతం..
రవీంద్రుని మనోగతం
అదే అయింది జగతికి
భారతీయుల పట్ల అవగతం..
హిమశిఖరమంతటి
జాతి గతం..
ఉత్తుంగ తరంగం..
స్వేచ్ఛా గీత విహంగం..
ప్రతి భారతీయుని అంతరంగం!
భగవాన్ శ్రీకృష్ణుడు
అందిస్తే భగవద్గీతాంజలి..
రవీంద్రుడు పంచిపెట్టినాడు
భారతావని గీతాంజలి ..
ఆ ఒక్క రచనతోనే అందుకుని
అత్యున్నత పురస్కారం నోబుల్..
అధిరోహించి సాహితీ లోకపు
ఉత్తిష్ఠ స్థానం..
ఆ ఋషి ఆశ్రమమే అయింది
శాంతినికేతన సంస్థానం!
ఎందరికో విలువలతో కూడిన
ఉన్నత విద్యా ప్రస్థానం!!
ప్రశాంత ముని..
నిర్మల ఋషి..
ఉన్నత భావాల తత్వవేత్త..
సాహితీ శాస్త్రవేత్త..
మానవతా మూర్తి..
జగతికి స్ఫూర్తి..
కరుణామూర్తి..
వ్యక్తిత్వం అరుదు..
విశ్వకవి బిరుదు..
రవీంద్రుని చరితం..
మహోన్నత భారతం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286