Suryaa.co.in

Entertainment

నవ్వింది మల్లెచెండు..

న్యాయం కావాలి ఆంటూ
చిరంజీవిని నిలదీసింది..

ప్రపంచజ్ఞానం లేని
కమల్ హాసన్ని
మనిషిని చేసింది..

శోభన్ బాబుని
జైలుపక్షిగా మార్చింది..
సూరువంశం హరిశ్చంద్ర ప్రసాద్ ను ఏమార్చింది..

లేత చలిగాలిలో దోచుకోరా దొరా..ఆంటూ చంద్రమోహన్ని
ఆట పట్టించింది..

అక్కినేనినీ అలరించింది..
కృష్ణంరాజునూ
కలవరపెట్టింది..!

ఎందరితో ఎన్ని చేసినా
నవ్వింది మల్లెచెండు
చిరు నచ్చిన గర్ల్ ఫ్రెండు..
ఆ ఇద్దరి కాంబినేషన్
ఓ ట్రెండు..!
భలే నాటీ..బ్లాక్ బ్యూటీ..
మెగాస్టారుతో పోటీ..
రాధిక ఎబిలిటీ..!

ఎంత చిలిపో..
ఇంకెంత బలుపో..
స్వాతిముత్యం
అదెంత మలుపో..
స్వాతికిరణం
ఇంకెంత గెలుపో..
సూర్యవంశం మరెంత
మైమరపో..
పోలికే లేని పాత్రల్లో
రాధిక కెవ్వుకేక..!

రాధాకల్యాణం..
రాధికా కల్యాణాలు..
మూడుముళ్లు సినిమా ఒక్కటే…
నిజజీవితంలో మూడుసార్లు
మూడుముళ్లు..
ఇప్పుడు మాత్రం శరత్ కాలం
రాడాన్ తో బుల్లితెరపైనా
వెలుగుతోంది చిరకాలం..

మనసు పలికే మౌనగీతం..
రాధిక అస్సలు
పట్టించుకోదు గతం…
అభిమతమే తన మతం..
తన అవగతమే
ఆమెకు సమ్మతం…!
నాన్న రాధా మార్కు..
నచ్చింది చెయ్యడమే
రాధికలోని స్పార్కు..!

సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE