Suryaa.co.in

Andhra Pradesh

రఘురామిరెడ్డి.. పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు లాంటి అధికారులు కచ్చితంగా మూల్యం చెల్లించు కుంటారు

– జగన్ రెడ్డి మెప్పుకోసం సీఐడీ, కౌంటర్ ఇంటిలిజెన్స్ విభాగాలు పరిధిదాటి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నాయి

• రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి..వేధించాలన్న జగన్ ఆలోచనల మేరకే కౌంటర్ ఇంటిలిజెన్స్ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డి పరిధి దాటి పనిచేస్తున్నారు.
• కిలారు రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని మొదట చెప్పి, తర్వాత దోషిగా పేర్కొని లుక్ఔట్ నోటీసు ఇవ్వడం సీఐడీ పనితీరుని ఎత్తిచూపుతోంది
• జగన్ ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్న వ్యవస్థల సర్వనాశనంలో భాగమే కౌంటర్ ఇంటిలిజెన్స్ సిబ్బందిని రాజకీయ కక్షలకు వాడుకోవడం.

– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

అధికారం తలకెక్కిన అహంకారంతో జగన్ రెడ్డి పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంగా మార్చాడని.. ఆ సైన్యం సాయంతోనే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై తప్పుడు కేసులుపెట్టి, అన్యాయంగా జైలుకు పంపారని, ఇప్పుడు అదే కోవలో జగన్ సర్కార్ టీడీపీనేత కిలారు రాజేశ్ ను టార్గెట్ చేసిందని, హైకోర్టులో చాలా స్పష్టంగా “రాజేశ్ నిందితుడు కాడు..కేవలం సాక్షి మాత్రమే” అని ప్రభుత్వ న్యాయవాది చెప్పినా, ఏపీ సీఐడీ తన వెబ్ సైట్లో రాజేశ్ ని మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా పేర్కొని లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడాన్ని ఏమనాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు?

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని, అక్టోబర్ 16వ తేదీన విచారణకు రావాలని సెక్షన్ 160 కింద అక్టోబర్ 10వ తేదీన నోటీసులు ఇచ్చి, నోటీసులకు భిన్నంగా అదే తేదీన రాజేశ్ ను మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా సీఐడీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొనడం చట్టవిరుద్ధం కాదా? రాజేశ్ ను విచారించే విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని చెప్పిన సీఐడీ.. మరలా రాజేశ్ పై లుక్ ఔట్ నోటీసు ఇవ్వడం ముమ్మాటికీ కక్షసాధింపులో భాగమే.

సీఐడీని గౌరవించి.. వారిచ్చిన నోటీసుకు స్పం దించి టీడీపీనేత రాజేశ్ వెళ్తే.. ఆయన్ని రాష్ట్ర ఇంటిలిజెన్స్ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డిలు తాము చెప్పినట్టు చేయాలని బెదిరించ డాన్ని ఏమనాలి? తాము చెప్పినట్టు చెప్పకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటావని రాజేశ్ ను వారు భయపెట్టడం… హైదరాబాద్ మహానగరంలో రాజేశ్ ను కొందరు అగంత కులు బైక్ పై వెంబడించడం.. వారిలో ఒకతను మరలా రాజేశ్ ను బెదిరించడం జగన్ రెడ్డి అరాచకపాలనకు, అతనికి దాసోహమైన పోలీస్ వ్యవస్థ అసమర్థతకు నిదర్శనం కాదా?

తనకు.. తనకుటుంబానికి ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో రాజేశ్ తనను వెంబడించిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడ పోలీసుల విచారణలో రాజేశ్ ను హైదరాబాద్ లో వెంబడించిన వారిలో ఆంజనేయులు ఒకడ ని..అతను కౌంటర్ ఇంటిలిజెన్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని నిర్ధారించిం ది వాస్తవం కాదా? డీజీ పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు, డీఐజీ రఘురామిరెడ్డి ఆదేశాల తోనే సదరు హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు రాజేశ్ వెంటపడ్డాడు.

కౌంటర్ ఇంటిలిజె న్స్ విభాగం టెర్రరిస్టుల కదలిలకపై నిఘా పెట్టాలి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం కౌంటర్ ఇంటిలిజెన్స్ సిబ్బందితో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతల్ని వెంటాడుతోంది. సీఐడీ.. ఇతర విభాగాల పొలిటికల్ బాస్ అయిన జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికే పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డి తాము తప్పులు చేయడమే కాకుండా తమకింది సిబ్బందితో చట్టవిరుద్ధమైన పనులు చేయిస్తున్నారు. రాష్ట్రం.. ప్రజలరక్షణ కోసం పనిచేయాల్సిన వ్యవస్థల్ని, జగన్ రెడ్డి తన రాజకీయ కక్షసాధింపులకు వాడటం ముమ్మాటికీ చట్ట విరుద్ధమే.

రాజ్యాంగం అనేది ఎవరికైనా ఒకటే. మనిషిని.. హోదాని బట్టి అది మారదు. రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన అధికారులు.. వ్యవస్థలు పొలిటికల్ బాస్ అయిన జగన్మోహ న్ రెడ్డి ప్రాపకం కోసం పనిచేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. వీధిరౌడీల కంటే ఘోరంగా రాష్ట్ర పోలీస్ శాఖలోని కొందరు అధికారులు పనిచేస్తున్నారు అనక తప్పదు.

హెడ్ కానిస్టేబుల్ లాంటి కొందరు కిందిస్థాయి సిబ్బందిని.. ఇతర ఉన్నతాధికారుల్ని జగన్ సర్కార్ గిట్టనివారి ని వేధించడానికి.. భయపెట్టడానికి వినియోగిస్తోంది. చట్టపరిధి దాటి వ్యక్తులకోసం పనిచేస్తున్న రఘురామిరెడ్డి.. పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు లాంటి అధికారులు కచ్చితంగా మూల్యం చెల్లించు కుంటారు.” అని నరేంద్ర హెచ్చరించారు.

 

LEAVE A RESPONSE