ఈడీ విచార‌ణ‌కు రాహుల్‌.. అడ్డుకున్న నేత‌ల అరెస్ట్‌

దిల్లీ: నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని ఈడీ విచార‌ణ‌కు తీసుకెళ్లిన నేప‌ధ్యంలో సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ నేత‌లు దేశ‌వ్యాప్త నిర‌స‌న‌కు దిగారు. నేత‌ల నుంచి పెద్ద ఎత్తున ల‌భించిన మ‌ద్ద‌తుతో రాహుల్‌గాంధీ ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా నిర‌స‌కారుల్ని పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించారు. ఈ నేఫ‌ధ్యంలో దిల్లీలోని జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయ‌కులు అంద‌రు ఏఐసీసీpcc కార్యాల‌యం నుంచి ర్యాలీగా బ‌య‌లుదేరి ఈడీ కార్యాల‌యానికి చేరుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగా ఏఐసీసీ కార్య‌ద‌ర్శి గిడుగు రుద్ర‌రాజు, పార్ల‌మెంట్ స‌భ్యులు జ్యోతిమ‌ణి, విశ్వ‌నాథ్ త‌దిత‌ర ఏఐసీసీ కార్య‌ద‌ర్శుల‌ను అరెస్టు చేసి మ‌యూర్ విహార్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. సాయంత్రం 6గంట‌లు దాటినా కూడా వారిని పోలీసులు విడిచిపెట్ట‌లేదు.

Leave a Reply