– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ఎంపీ రవిచంద్ర
రాజ్యసభ సభ్యులు రవిచంద్ర ఎంపీలు కేశవరావు, నాగేశ్వరరావు,పాటిల్,రాములు, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,లోక్ సభ సభ్యులు బీ.బీ.పాటిల్,పీ.రాములు,మన్నె శ్రీనివాస్ రెడ్డి,కొత్త ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ..బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని కాంగ్రెసు నాయకుడు రాహూల్ గాంధీ అనడం తీవ్ర అభ్యంతరకరంఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన లీడర్ గా కాకుండా రీడర్ గా మాట్లాడుతుండు,పది, పదిహేను రోజుల కిందట ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివారు.
బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ కంటే ఎక్కువ మా పార్టీనే ఎండగడుతున్నది. పార్లమెంటులో నల్ల చొక్కాలు ధరించి నిరసనలు తెలిపాం,అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే చేశాం.
రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి బహిష్కరణకు గురైన సందర్భంలో ఆయనకు అండగా నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది, తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యం.