– లక్ష కోట్లు సెంట్రల్ ఫైనాన్సియల్ కంపెనీల నుంచి ఫండింగ్ జరిగింది
– కాంగ్రెస్,బీజేపీ అధ్యక్షులు మెగా కి జీతగాళ్ళు లా మారారు
– వారికి మెగా కృష్ణా రెడ్డి డబ్బులు పంపిస్తున్నారు.
– కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ప్రశ్నించాలని డిమాండ్
– ఈ ప్రాజెక్ట్ ఒక మెగా మోసం
– ఒక 2G , కొల్ పెద్ద స్కాం కన్నా తీసిపోయేది ఏమి కాదు
– రాహుల్ గాంధీ కి బహిరంగ లేఖ రాసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాక ను స్వాగతిస్తున్నం. తెలంగాణ ప్రజల సమస్యల పై మాట్లాడాలి. దేశంలో అతి పెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్. రాహుల్ గాంధీ గారు ఈ స్కామ్ గురించి మాట్లాడాలి.కేసీఅర్ కాళేశ్వరం ఒక అద్బుతం అన్నారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని కేవలం 57 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు.
వైఎస్సార్ 38 వేల కోట్ల తో పూర్తి చేయాలని అనుకున్నారు.ఒక ముఖ్యమంత్రి 38వేల కోట్లకు చేయాలని అనుకున్న ప్రాజెక్ట్ ను లక్షా 20 వేల కోట్లకు ఎలా పెంచారు.ఈ ప్రాజెక్ట్ ఒక మెగా మోసం. ఈ ప్రాజెక్ట్ ఒక మెగా అబద్ధం. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలో నే అతి పెద్ద కుంభకోణం. ఒక 2G , కొల్ పెద్ద స్కాం కన్నా తీసిపోయేది ఏమి కాదు. స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా సీఎం కేసీఅర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడాలి.కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం పై దక్కాల్సిన అటెన్షన్ దక్కడం లేదు. మీడియా హౌజ్ లను మెగా కృష్ణారెడ్డి,కేసీఅర్ మేనేజ్ చేస్తూ నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒక్కటే ఈ స్కాం పై మాట్లాడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్,బీజేపీ అధ్యక్షులు మెగా కి జీతగాళ్ళు లా మారారు. వారికి మెగా కృష్ణా రెడ్డి డబ్బులు పంపిస్తున్నారు. అందుకే ఎవరు నోరు విప్పడం లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా అవినీతి తేటతెల్లం అవుతున్నా ఎవరు మాట్లాడటం లేదు.. ఏ పార్టీ కూడా కాళేశ్వరం గురించి మాట్లాడటం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే కాళేశ్వరం అవినీతి పై పోరాటం చేస్తోంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్న. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు..మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇక్కడ మాట్లాడటం లేదు..? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం హోదా లో ఉంది. ప్రధాన ప్రతి పక్షం అయి ఉండి కూడా ఎందుకు మాట్లాడటం లేదు?మీ పార్టీ ఎమ్మెల్యే లు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారు. మిగిలిన వారు పార్టీలో ఉండి అమ్ముడు పోయారు. ఏమిటి తేడా..? ఎందుకు మాట్లాడటం లేదు మీరు..?ఊరికే రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే సరిపోదు.కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై మీరు మాట్లాడాలి. లక్ష కోట్లు సెంట్రల్ ఫైనాన్సియల్ కంపెనీల నుంచి ఫండింగ్ జరిగింది.అందుకే ఈ ప్రాజెక్ట్ కుంభకోణాన్ని నేషనల్ స్కాం అంటున్నాం.బీజేపీ నేతలు సైతం ఈ ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగింది అంటున్నారు.
జలశక్తి శాఖ మంత్రి,ఆర్థిక మంత్రి పదే పదే అంటున్నారు.ప్రాజెక్టు అవినీతి పై ఆధారాలు ఉంటే మీరు విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు..? సీబీఐ తోనో…లేక ఈడి తోనో .. విచారణ జరిపించవచ్చు కదా.. బీజేపీ మతం గురించి మాట్లాడమని అంటే…గొప్పగా మాట్లాడుతుంది.దేశానికి మీ పార్టీ ఒక కాపలా కుక్క లా ఉన్నప్పుడు మీరు విచారణ జరిపించాలి కదా?