Suryaa.co.in

Telangana

డప్పు కళా ప్రదర్శనను తిలకించిన రాహుల్

భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా బాణాపురం డప్పు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ డప్పు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. డప్పు కళాకారుల విశిష్టత గురించి రాహుల్ గాంధీ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు.

LEAVE A RESPONSE