Home » జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ దళిత జాతి పరువు తీస్తున్నారు

జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ దళిత జాతి పరువు తీస్తున్నారు

– టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి , మాజీ మంత్రి పీతల సుజాత

వైసీపీలో ఎమ్మెల్యే సీటు కోసం చట్టాలను పక్కన పెట్టి జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ దళిత జాతి పరువు తీస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి లా అండ్ ఆర్డర్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసు వ్యవస్తే అడ్డదారులు తొక్కుతోంది. రక్షించాల్సిన రక్షకులే బక్షిస్తున్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవంలంబిస్తోంది. ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులను టార్గెట్ చేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సీఐడీ శాఖని ఛీఫ్ మినిష్టర్ డిపార్టుమెంటును చేసేశారు. ధర్మపీఠంలాంటి సీఐడీ డిపార్టుమెంటును నిర్వీర్యం చేశారు. ఆ శాఖను దిగజార్చారు. సునీల్ కుమార్ వచ్చాక సీఐడీ డిపార్టుమెంటు దారుణమైన పరిస్థితుల్లో ఉంది.

స్వార్థ ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నారు. సీఎం చెప్పిన పనులు చేస్తూ టీడీపీవారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇండియన్ పోలీసు ఆఫీసర్ గా బాధ్యత వహించాల్సివుంది. రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత సునీల్ కుమార్ పై ఉంది. నిష్పచ్ఛపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని వేల, లక్షల పోస్టులు ఫార్వర్డ్ అవుతుంటాయి. ఆ మెసేజ్ లను పట్టుకొని టీడీపీని టార్గెట్ చేస్తారా? సునీల్ కుమార్ వచ్చాక ఆడవారిపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. ఆడవారిని అవమానపరుస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారు? రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేదు. సీఎం భార్యను ఏమైనా అన్నా, ఏమనకపోయినా వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మిగతావారు ఆడవారు కాదా? టీడీపీ తరపున ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన స్వీకరించడంలేదు. సీఐడీ చీఫ్ తమ తీరు మార్చుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ్రహించాలి.

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి మాట్లాడుతూ..సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన వ్యక్తిగత ప్రెస్టేషన్ ని ప్రతిపక్ష పార్టీపై రుద్దుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. వైసీపీ నాయకులు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇది ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రికి అనుకూలంగా లేకపోతే వేధింపులు తప్పడంలేదు. ఎమ్మెల్యే సీటు కోసం జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. సునీల్ అనేక దుష్చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారు. దురాగతాలు జరగకుండా చూడాల్సిన పోలీసు వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. తరువాత బాధపడాల్సివస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు లేకుండా చేయాలి. ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలి. తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే పంథాలో నడుస్తున్నారు. ఈ పద్దతి మానుకోవాలి. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే, ఎంపీ సీటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జగన్ రెడ్డికి ఊడిగం చేయడంలో నిమగ్నమయ్యారు. సీఐడీ సునీల్ దళిత జాతి పరువు తీస్తున్నారు.

మాజీ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ.. జగన్ రెడ్డిని సంతృప్తి పరచడానికే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆరాటపడుతున్నారు. పగా ప్రతికారానికి దిగుతున్నారు. ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడడానికి ఒక వ్యక్తి కావాలి కావున సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను పెట్టుకున్నారు. సీఐడీ సునీల్ కుమార్ జగన్ కు తొత్తుగా మారారు. ఎంపీ పదవి కోసం జగన్ ను సంతృప్తి పరుస్తున్నారు. ఎంపీ అవ్వచ్చనుకుంటున్నారు. కానిపని. అందుకే దగ్గర దారి ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసకు గురిచేస్తున్నారు. టీడీపీ నాయకులు బాధపడుతున్నారు. నేరాలను కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి నేరాలకు పాల్పడుతున్నాడు. కంచే చేను మేస్తున్న చందంగా సునీల్ కుమార్ వ్యవహారశైలి ఉంది. గతంలో అనుబంధ సభ్యుడిగా ఎయిమ్స్ అనే సంస్థను పెట్ట రాజకీయ లబ్ది పొందడానికి తాపత్రయ పడుతున్నారు. ఎఫ్ఐఆర్ ని ఫాలో అవడంలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు అనేక సందర్బాల్లో 41 నోటీసు ఇవ్వమని చెప్పినప్పటికీ తుంగలో తొక్కారు. అమలాపురంలో పోటీచేయి సమాధానం చెబుతాం.

రఘురామరాజునో, దారపనేని నరేంద్ర ను కొట్టినట్లు హింసా ధోరణిలో సమర్తిస్తే సంతోషపడతాం.
దోపిడీ, దుర్మార్గాలను నిరోధించాలి. జరుగుతున్న అన్యాయాలు, దుర్మార్గాలపై అనేక ఉత్తరాలు రాశారు.ఒక్క దానికి ఎఫ్ ఐఆర్ కట్టలేదు. జగన్ ను, భారతిని ఎవరైనా తిడితే , తాడేపల్లి ప్యాలెస్ గురించి మాట్లాడినా, జగన్ ఆస్తుల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆగమేఘాలపై వస్తారు. సోషల్ మీడియాలో వైసీపీ పై వ్యతిరేకంగా వచ్చే పోస్టులను ఆధారంగా చేసుకొని అరెస్టులు చేయడం అన్యాయం. రాబోయే రోజుల్లో దళితులందరూ కలిసి బుద్ది చెబుతారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు మాట్లాడుతూ .. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు. మొత్తం సీఐడీ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి వేధించి కస్టడీలో చిత్రహింసలు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టమని మీకు చంద్రబాబు , లోకేష్ , అచ్చెన్నల్లో ఎవరు చెప్పారని అర్ధరాత్రి వరకూ హింసిస్తున్నారు. దళితులు తలదించుకునేలా, ఉమ్మేసేలా సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నాడు.

సునీల్ తన వ్యతిగత సమస్యల కోపాన్ని ప్రశ్నించేవారిపై రుద్దడం సరికాదు. కావాలంటే భార్య బాధిత సంఘానికి సునీల్ కుమార్ అధ్యక్షుడిగా ఉండాలికానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమేంటి? ముఖ్యమంత్రికి భజన చేయమని సర్వీసులో మీకు ట్రైనింగ్ చేశారా? రాష్ట్రంలో దళితుడలపై , మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని సునీల్ కుమార్ …కేవలం జగన్ ఆయన కుటుంబంపై పోస్టులు పెడితే మాత్రం రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు పార్టీలో పనిచేయకుండా బెదిరించడం సరికాదు. నిజంగా ఐపీపీ అధికారి ఐతే దళితుల దాడులపై ఎందుకు స్పందించడంలేదు? వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై టీడీపీ నేతలు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నాలుగైదు వేలకు పైగా ఫిర్యాదు చేసినా ఒక్క దానిపైనైనా స్పందించారా? న్యాయవ్యవస్థపై దూషణలు చేసినా మహిళల వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగినా సునీల్ కుమార్ ఏనాడు పట్టించుకోలేదు. ప్రజల కష్టాలపై స్పందించరు. కేవలం జగన్ రెడ్డి బూట్లు నాకే విధంగా ఏపీ సీఐడీ చీఫ్ వ్యవహారశైలి ఉంది. టీడీపీ నేతలను హింసించేందుకే ఏపీ సీఐడీని వాటడం దారుణం. సునీల్ ను ప్రేరణగా తీసుకోవాల్సిన దళితులు అతని వ్యవహారశైలి చూసి అసహ్యించుకుంటున్నారు.

పరసా రత్నం, మాజీ మంత్రి
రాష్ట్రంలో దళితులకు దారుణమైన అవమానం జరుగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యవహారశైలితో దళితులను ఘోరంగా అవమానిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని సునీల్ కుమార్ గుర్తించాలి. ఎప్పుడూ అమావాస్య రోజులే ఉండవు. పౌర్ణమి కూడా వస్తుంది. ఆ వెలుగులో జగన్ రెడ్డి చీకట్లోకి వెళ్లిపోవడం ఖాయం. సునీల్ కుమార్ వ్యక్తిగత ఇబ్బందులను ప్రజలపై రుద్దడమేంటి? టీడీపీ కార్యకర్తలను ముఖ్యంగా దళితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సునీల్ కుమార్ అరాచకాలకు మా ప్రభుత్వం వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడం, ఉల్లంఘించడం, పక్కనపడేస్తూ… సొంత రాజ్యాంగాన్ని జగన్ రెడ్డి అమలు చేస్తున్నారు. అయితే ఐపీఎస్ చదివి, అంబేద్కర్ అంటే ఇష్టం అని చెప్పుకునే సీఐడీ సునీల్ కుమార్.. జగన్ రెడ్డి ఆలోచనలు అమలు చేస్తున్నారు. యావత్ దళిత జాతి సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోవాలి. మీపై వస్తున్న ఆరోపణలు చూసి దళితులగా మేం బాధపడుతున్నాం. ఐదేళ్ల పాటు ఉండే జగన్ రెడ్డి కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచడం ఎంతమాత్రం తగదు. మీ చర్యలను మేం ఖండిస్తున్నాం. సీఐడీ అంటే పెద్దపెద్ద నేరాలు చేసిన వారిని విచారించాలి. ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న సోషల్ మీడియాలో పోస్టుల పట్ల ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. వైసీపీ పేటిఎం బ్యాచ్ పెట్టిన పోస్టుల పట్ల చర్యలు తీసుకునే దమ్ముందా? దళితుల అభివృద్ధికి, గుర్తింపు కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు, ఎన్టీఆర్. ఇవాళ గ్రామాల్లో దళితులకు తినడానికి తిండి లేదు. వారు సంపాదించే డబ్బులు లిక్కర్ కోసం వెచ్చిస్తున్నారు. దళితులు చంద్రబాబుకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ.. సీఐడీ సునీల్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదు. టీడీపీ లక్ష్యంగా ఎయిమ్స్ అని సంస్థ పెట్టి నేతలను బాధపెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం టీడీపీదేనని గుర్తుపెట్టుకోవాలి. సునీల్ తగిన మూల్యం చెల్లించుకుంటారు. చట్టపరంగా మా ప్రభుత్వంలో చర్యలు ఉంటాయి. నేడు దళితులపై దాడులు పెరిగిపోయాయి. జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వాక్ స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై శారీరక, మానసిక హింసకు పాల్పడుతున్నారు. నేరం చేసేవాడు కాదు… నేరం చూస్తున్నవాడు కూడా దోషే. మేం వస్తే మీపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా టీడీపీ కార్యకర్తలు, నాయకుల పట్ల ఎలాంటి నోటీసులు లేకుండా కేసులు పెట్టి హింసించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సునీల్ దళిత సామాజికవర్గం నుంచి వచ్చారు. అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన సునీల్.. ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తుచేసుకోవాలి. దళితులు తలెత్తుకుని తిరుగుతున్నారంటే అంబేద్కర్ కారణం. సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్.. చిన్న చిన్న కార్యకర్తలపై తన ప్రతాపం చూపిస్తున్నారు. వివేకానందరెడ్డిని హత్యచేస్తే.. మీరు ఏం చేస్తున్నారు. కేసులు ఇతర రాష్ట్రానికి బదిలీ చేసే పరిస్థితి. జగన్ రెడ్డి చెల్లికే న్యాయం జరగని పరిస్థితి. ఈ కేసును మీరు టేకప్ చేసి దోషులను పట్టుకోవాలి. ఇది వదిలేసి వాట్సాప్ లలో వచ్చిన వాటిపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కోడికత్తి కేసు నిందితుడి తల్లి జగన్ రెడ్డిని కలవడానికి వస్తే పట్టించుకోకపోగా.. కేసు విషయంలో ఎలాంటి చర్యలు లేవు. మీ చర్యలను ఒక్కసారి పునపరిశీలించుకోవాలి.

Leave a Reply