Suryaa.co.in

Telangana

ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్ మాటలు అభ్యంతరకరం

-సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

పార్టీలో ప్రధాన నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ మాటలు అవగాహన రాహిత్యం గా ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.మూడు సంవత్సరాల రికార్డ్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర రైతాంగంకు సాగునీటి అందిస్తోంది.80 వేలపై చిలుక కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంకు జీవనాధారం.కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయింది.నాడు కరువు తో ఉన్న తెలంగాణ ఇవాళ ఎక్కడ చూసిన నీళ్లు ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండుతుంది.

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది అంటే కారణం సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు .అలాంటి ప్రాజెక్టు గురించి రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడారు.దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయికాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇలా మాట్లాడం విడ్డురంగా ఉంది. ఇక్కడి నాయకులు రాసిచ్చిన అబద్దాల స్క్రిప్టు రాహుల్ గాంధీ చదివారు.

ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతాం అన్నట్టు ఉంది 4000 పెన్షన్ అనేది.కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎంత పెన్షన్ ఇస్తున్నారు ముందుగా చెప్పాలి.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2016 పెన్షన్ ఉంది.వికలాంగులకు 3016 ఉంది 4000 చేస్తాం అని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు
పోడు భూముల గురించి కూడా అబద్ధపు మాటలు మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ జరుగుతుంది. అయినప్పటికీ మేము అధికారంలోకి వస్తే పోడు భూములు పంపిణీ చేస్తామంటున్నారు రాహుల్ గాంధీ.

బీజేపీ కి బి టీం అంటారు కానీ ఎవరికి ఎవరు బి టీమో చెప్పాలి.నేషనల్ హెరాల్డ్ కేస్ సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, దీన్ని బట్టే అర్థం అవుతుంది.హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు ఎవరికి బి టీం గా ఉన్నారో అందరికి తెలుసు.ఆయా ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు చూస్తేనే అర్థం అవుతుంది మీరు బి టీం అని మళ్ళీ కొత్తగా చెప్పడం ఏంటి.

మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇక్కడ అమలవుతున్న పథకాలు అక్కడ అమలు చేయడం లేదు.కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్,గురుకుల పాఠశాలలు ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయడం లేదు.తెలంగాణ లో మీ మాటలు నమ్మేవారు లేరు.

తెలంగాణ ప్రజలు చాలా గొప్పవారు ఇక్కడ పథకాల ఫలితాలు అందుకున్న వారు ఇక్కడ ఉన్నారు వారికి అన్ని తెలుసు.ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భట్టి విక్రమార్కను వేదిక మీదనే తోసివేశాడు. పిసిసి నాయకుడు రేవంత్ రెడ్డి ఇది మీ సంస్కారం

LEAVE A RESPONSE