– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
పలాస: పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఫ్లైఓవర్ ని వచ్చే ఏడాది మార్చి నెలలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైల్వే ఫ్లైఓవర్ పునః పనులకు శాసన సభ్యురాలు గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం లో రైల్వే బ్రిడ్జి నిర్మాణ గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు నిలిచిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో రైల్వే బ్రిడ్జి పనులను ప్రారంభించగలిగామన్నారు
కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రెవిన్యూ పరంగా భూ సమస్యలు పరిష్కరించి ఉపాధి కోల్పోయిన వారికి రైల్వే శాఖ నుండి నష్టపరిహారం అందించనున్నామన్నారు. ఎమ్మెల్యే గౌటు శిరీషా మాట్లాడుతూ ఎన్నికల మీ మేరకు తొలి సంవత్సరంలోనే 80 శాతం వరకు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు వజ్రపు కొత్తూరు మండలం పూడికలంకలో అంచనా వ్యయం రూ.4కోట్లతో నిర్మించనున్న వంతెన పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే, కలెక్టర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో గతి శక్తి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉప ప్రధాన ఇంజనీర్ పంకజ్ చౌహాన్, వాల్టేర్ ఏ ఎక్స్ ఈ ఎన్/కన్స్ట్రక్షన్/ ఆర్ ఎస్ పి డి.ప్రకాష్ రావు, ఆర్డిఓ జి. వెంకటేష్, తహశీల్దార్ టి.కల్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.