వేదం పుట్టినప్పుడు
ప్రణవనాదం మోగినప్పుడు
దేవుడు తొమ్మిది
అవతారాలెత్తినప్పుడు
జెండా ఊంచా
రహే హమారా..!
ప్రపంచానికి
నాగరికతను
పరిచయం చేసినప్పుడు
సంస్కృతిని అలవాటు చేసినప్పుడు..
సమభావాన్ని.. సమరసతను
విశ్వానికి చాటినప్పుడు
జెండా ఊంచా
రహే హమారా..!
జగమునెల్ల గెలిచిన అలెగ్జాండర్
ఇక్కడ తొలిసారిగా తలదించినప్పుడు
పరాజయం చవిచూసినప్పుడు
జెండా ఊంచా
రహే హమారా..!
మనపై దండెత్తి వచ్చిన ముష్కరమూకల
భరతం
పురుషోత్తముడు..
ఝాన్సీలక్ష్మీ…
రుద్రమదేవి..
రాణా ప్రతాపుడు..
పట్టినప్పుడు..
తరిమి కొట్టినప్పుడు..
జెండా ఊంచా
రహే హమారా..!
దక్షిణాఫ్రికాలో
మన గాంధీ మొదటగా దిక్కులు పిక్కటిల్లగ మొండితనాన్ని చూపినప్పుడు.. వివేకానందుడు
చికాగోలో మతపెద్దలను
తన మాటలతో మంత్రముగ్ధులను చేసినప్పుడు..
జెండా ఊంచా
రహే హమారా..!
భరత జాతి
దాస్య శృంఖలాలు
తెంపగ టెంపరిగ ఎందరెందరో విప్లవవీరులు తిరుగుబాటు నినాదాలు..
తెగబాటు నాదాలు
చేసి తెల్లదొరలను తరిమికొట్టిన
ఆ అర్ధరాత్రి
పగటి సూర్యుడు
ఉదయించినప్పుడు..
స్వేచ్ఛా వాయువులు పరవశింప చేసినప్పుడు
జెండా ఊంచా
రహే హమారా..!
నడుమ నడుమ
బంగ్లా రక్షణ కోసం..
దేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం
సమరాలు సాగించి
విజయాలు సాధించి
జెండా ఊంచా
రహే హమారా
అనిపించుకున్నా..
జాతిపిత నేలకొరిగిన దుర్ముహూర్తాన విజృంభించిన దుష్టశక్తులు దేశాన్ని పరిపరి విధముల పతనం చేయగ..
అవినీతి.. లంచగొండితనమే
రాజ్యమేలుతుండగ..
నానావిధ అక్రమ మార్గాల ఎన్నికల్లో గెలుస్తున్న నేతలు
స్వార్థమే పరమార్థంగా
పాలన చేస్తూ..
మన పరువును తీస్తుంటే..
పర సంస్కృతీ వ్యామోహంతో
మన మూలాలను వదిలి
పతనమైపోతుంటే..
మన దేశ సార్వభౌమత్వాన్ని
కొన్ని దేశాల ముంగిట తాకట్టు పెడుతుంటే..
అప్పుడు కొంత లోపమై..
భరతమాతకు కోపమై..
మన ఉన్నతికి శాపమై..
మహోన్నత దేశం
మురికి కూపమై..
మువ్వన్నెల జెండా
రంగు వెలిసె..
మన నేతల
అసలు రంగు తెలిసె..!?
ప్రపంచం అంచనాలు తల్లక్రిందులు కాగా
కరోనా మహమ్మారిపై
సాగిన..సాగుతున్న
మన పోరు..
అదుపు చేసిన తీరు..
ప్రపంచాన అతి పెద్ద
లాక్ డౌన్ అమలు
చేసిన స్ఫూర్తి..
అగ్రరాజ్యానికే మందులు అందచేసిన కీర్తి..
శ్వేతసౌధమున
మన మంత్రాల ఆలాపన..
విదేశ చట్టసభలలో
సైతం సాగిన
మన ప్రార్థన..
భారతీయ ప్రాచీన జీవన విధానాల ఆరాధన..
యోగ సాధన..
విశ్వాన అత్యంత గర్వంగా
జెండా ఊంచా
రహే హమారా..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286