Suryaa.co.in

Telangana

రామగుండంలో భూములు.. బూడిద… ఉద్యోగ అమ్మకాలు

కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ్ ఠాకూర్

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబందించిన కుంభకోణం.శాసన సభ్యులను మాకు న్యాయం జరగాలని పోరాటం చేశాము.నా చావుతో అయినా అందరికీ న్యాయం జరుగుతుందని….700 మందికి ఉద్యోగ భద్రత.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిన సమయంలో పోరాటాలతో మళ్ళీ తెరిపించుకున్నం.

శాసన సభ్యులు ఎరువులకు సంభందించి లక్షల రూపాయల తో కాంట్రాక్ట్ తీసుకున్నారు. స్థానికులు అప్పులు చేసు ఉద్యోగాల కోసం దళారులకు ఇచ్చారు. 300మంది కన్న ఎక్కువ మందిని తీసుకొని, తర్వాత కాంట్రాక్ట్ మారడంతో సగం మందిని తొలగించారు. మాజీ శాసన సభ్యులు గోనె ప్రకాశరావు దీని మీద మాట్లాడరు.

8 నెలలుగా కాలయాపన చేశారు కానీ పరిష్కారం చేయలేదు.శాసన సభ్యుడి మూలంగా నిండు ప్రాణం పోతుంది.రెండు రోజుల్లో సీఎం అక్కడికి వస్తున్నారు. కేసీఆర్,కేటీఆర్,గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. బాధితులకు తిరిగి డబ్బులు అందించాలి. దీనిని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం.చనిపోయిన హరీష్ గౌడ్ కుటుంబానికి RFCL లో ఉద్యోగం ఇవ్వాలి,కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామగుండంలో అమ్మకాలు జరుగుతున్నాయి. భూముల అమ్మకాలు, బూడిద అమ్మకాలు,ఉద్యోగ అమ్మకాలు అన్ని జరుగుతున్నాయి. దీని మీద పీపుల్స్ వార్ కూడా హెచ్చరించింది. శాసన సభ్యుడి ముఠా ఇది చేసింది. గవర్నర్ దృష్టికి తీసుకు పోతాం. దీనికి ప్రభుత్వం పరిష్కరించకపోతే. చలో హైదరాబాద్ తో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తాం 50 కోట్లు ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ప్రతి సారి కేటీఆర్ పేరు ప్రస్తావిస్తారు. కాబట్టి కేటీఆర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలి.

LEAVE A RESPONSE