Suryaa.co.in

Telangana

నామినేషన్ రోజే రాజగోపాల్ రెడ్డి డకౌట్ అయ్యాడు

-మునుగోడు ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు
-రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం వచ్చిందే ఈ ఉపఎన్నిక
-మునుగోడులో ఎక్కడికి పోయిన ప్రజలు అదే మాట చెప్తున్నారు..ఆయనకు డిపాజిట్ వచ్చుడు కూడా కష్టమే
-ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి
-మహిళలు,రైతులు,యువత నుంచి పెద్ద ఎత్తున మంచి ఆదరణ లభిస్తోంది
-టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయం
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పలువురు మహిళలు,వృద్దులు,చిన్నారులను ఆత్మీయంగా పలకరించారు. కేసిఆర్ కే మా ఓటు అంటూ పలువురు వృద్దులు,మహిళలు మంత్రితో ఆప్యాయంగా ముచ్చటించారు. గ్రామస్థుల విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. డి.నాగారం గ్రామ ప్రజలు ఆదరణ పట్ల మంత్రి వేముల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన పలువురు మైనార్టీ యువకులు, గ్రామ 9వ వార్డు మెంబర్ జహంగీర్ మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు…రాజ గోపాల్ రెడ్డి 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. సొంత ప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరాడని మంత్రి వేముల విమర్శించారు. నామినేషన్ వేసిన రోజే రాజగోపాల్ డకౌట్ అయ్యాడని,మునుగోడు ప్రజల ఆదరణ కోల్పోయాడని తెలిపారు. కాంట్రాక్ట్ కోసమే బిజెపిలోకి పోయాడని మునుగోడు ప్రజలే చెప్తున్నారని, వారి మాటల బట్టి చూస్తే రాజ గోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేటట్టు లేదన్నారు.

నాలుగేళ్ళు ఎమ్మెల్యే గా ఉండీ ఏం చేయలేని రాజ గోపాల్ రెడ్డి..ఇప్పుడు ఏం చేస్తాడని ప్రశ్నించారు. రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్,ఏడాదికి ఎకరానికి 10 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం, గుంట భూమి ఉన్న రైతు కూడా దురదృష్టవశాత్తూ మరణిస్తే 5 లక్షల రూపాయల రైతు భీమా,కళ్యాణ లక్ష్మి, శాదిముబారక్,ఆసరా పెన్షన్లు కేసిఆర్ తెలంగాణలో ఇస్తున్నట్లు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు.ఇంకో సంవత్సరం అయితే సాధారణ ఎన్నిక వచ్చేది,ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం వచ్చిన ఎన్నిక కాదా అని మంత్రి నిలదీశారు.

ఒక్కడి నాగారం గ్రామంలోనే 439 మందికి 2వేలు,3వేలు చొప్పున 10 లక్షల రూపాయల పెన్షన్ ఇస్తున్నామన్నారు. గతంలో 300 మందికి 200 చొప్పున 60 వేలు ఇచ్చేవారన్నారు. రైతులు, మహిళలు, యువకులు, ఊర్లో పెద్ద మనుషులు దీనిపై ఆలోచన చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రచారంకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని,మంచి స్పందన వస్తుందని తెలిపారు.

ఎల్లంబావి,కొయ్యల గూడెం డి.నాగారం నుంచి పీపల్ పహాడ్ వరకు రోడ్డు నిర్మాణం కోసం వచ్చిన విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా తాను ఆ బాధ్యత తీసుకొని రోడ్ వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మైనారిటీ సంఘ భవనం,స్మశాన వాటిక,పలు కుల సంఘ భావనాలు ఒక్కొక్కటిగా నిర్మించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. చిన్నపాటి టెక్నికల్ పొరపాట్లతో ఆగిన కొత్త పెన్షన్లు మంజూరికి కృషి చేస్తానని,అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ వచ్చేలా చూస్తానని మంత్రి భరోసానిచ్చారు. అభివృద్ధితో పాటు అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు.మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు,యువకులు పలువురు ఉన్నారు

LEAVE A RESPONSE