Suryaa.co.in

Telangana

ఈటల రాజేందర్ గారు..ఏడేళ్ల బీజేపీ- తెరాస పాలనకు మధ్య రెఫరెండంగా తీసుకుందామా?

-పెంచిన గ్యాస్ ధరలు సమర్థిస్తున్నారా ? అది చెప్పి ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఓట్లు అడగాలి
– పెంచిన పెట్రోల్- డిజీల్ ధరలు సమర్థిస్తున్నారా ? అది చెప్పి ఓట్లు అడగాలి
– బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్నరా? చెప్పి ఓట్లు అడగాలి
– గ్యాస్ సిలిండర్ ధరపై రాజీనామా సవాల్ కు రెండు రోజులయినా స్పందించలేదెందుకు ?
– హుజూరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావుప్రెస్ మీట్
ఏ మీటింగ్ కు వెళ్లినా కరెంటు కట్ చేస్తున్నారని, వేధిస్తున్నారని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈటల రాజేందర్ చిలిపి ప్రయత్నం చేస్తున్నారు. శంకర్ నందన్ హాలులో మీటింగ్ పెట్టుకుంటే , ఈటల మైక్ మూగబోయింది. దానికి టీఆర్ఎస్ వాళ్లు కరెంట్ కట్ చేశారని గోబెల్స్ ప్రచారం చేశారు. దుష్ప్రచారం బాగా సోషల్ మీడియాలో చేశారు.
వారి ఫ్యూజులు వాళ్లే పీక్కోని కరెంట్ కట్ చేసుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కాని విద్యుత్ శాఖ వాళ్లు శంకర్ నందరన్ ఫంక్షన్ హాలు వాళ్లు కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ కట్ చేశారని చెప్పారు.
మా విప్ సుమన్ కారు ఓ ఆటో డ్రైవర్ ను గద్దిందని చెప్పి జాతీయ రహదారిపై చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశారు. సుమన్ కారు గుద్దిందని, తర్వాత సుమన్ సోదరుడు కారుని, తర్వాత ఇంకోకరని భ్రమలు కల్పించారు.
రాత్రి పది గంటల సమయంలో టీఆర్ఎస్ వాళ్ల కారు , అందులో డబ్బులు,మద్యం ఉందని డ్రైవర్ తాగి గుద్దారని నానా యాగీ చేశారు. చివరకు సీసీ కెమెరా చూసి పోలీసులు కారును పట్టుకుంటే, విశ్వనాథ్ ఆనంద్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు, అతని కుమారుడు అని తేలింది.దీన్ని ఏ రకంగా సమర్థిస్తడు. దీనిపై మళ్లీ ఒక్క మాట మాట్లాడలేదు.
రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలండర్ పై 291 రూ పన్ను వేస్తుంది, దాన్ని తొలగించవచ్చు కదా అని ఇంటింటికి బీజేపీరాష్ట్ర నేతల మొదలు, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ వద్దకు వస్తాపదవికి రాజీనామా చేస్తా మీరుపోటీ నుంచి తప్పుకుంటా అని మాట్లాడి రెండు రోజులయింది. కాని ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎందుకు స్పందించలేదు. నిజంగా రాష్ట్ర పన్ను291 రూ ఉందా. ఏడేళ్లు మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో జీఎస్టీవచ్చింది. సిలిండర్ పై పన్ను రాష్ట్ర ప్రభుత్వపరిధిలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యే గా ఉన్నారు.ఆర్థిక మంత్రిగా నేను రాజీనామా కు రడీ అన్నా… రెండు రోజులయింది. మాట్లాడటం లేదు.
కమలాపురంలో ఈటలరాజేందర్ శంభునిపల్లిలో మాట్లాడారు.శంభునిపల్లి లో మహిళలకువడ్డీ లేని రుణం కు సంబంధించి ఫెక్ చెక్కులు ఇచ్చారు. దీన్ని ఈ నెల 30 లోగా చెక్కులు క్లియర్ చేయాలని అన్నారు. ఇలాంటి అబద్దాలు, గోబెల్స్ ప్రచారం మీకు తెలుసు. మాకు తెలియదు.
జన్ ధన్ ఖాతాలు తెరవండి అక్కౌంట్లో డబ్బులు 25 కోట్ల 89ల క్షల రూపాయలు ఐదు మండలాల్లో ఇచ్చినం. బతుకమ్మపండుగ ముందు అందరి అక్కౌంట్లలో ప డ్డాయి. మహిళలు కూడా డ బ్బులు వచ్చినయ్ అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ పూట వడ్డీలేని రుణం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరపెంచిందని చెప్పారు.బట్ట కాల్చి మీద వేస్తామని అంటే విశ్వసనీయత ఉంటుందా. మేం మద్యం, మాంసం పంచామని, 20 వేలు ఇస్తున్నరు అని ప్రజలను మోసం చేస్తున్నరు.
ఆరుసార్లు ప్రజలు మిమ్ముల్ని గెలిపిస్తే, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అంటే హుజూరాబాద్ ప్రజలు కించపరుస్తున్నరు. సర్పంచులను, ఎంపీటీసీలు నాయకుల పట్ల అలాగే మాట్లాడతున్నరు. గ్రైండర్లు, గడియారాలు, కుట్టుమిష్లన్లు పంచింది ఎవరు, వారినిప్రజలు తిరస్కరించి నేల మీద కొట్టారు. అబద్దాల పునాదుల మీద చేసే ప్రచారలను, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారాలు,కరపత్రాల రూపంలో చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టండి.
టీఆర్ఎస్ చేసిందే చెప్పింది, చేసేదే చెప్పింది, మేం ఢిల్లీకి గుళాంలు కాదు. ప్రజలకే గుళాంలు బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గుళాం గీరీ చేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ గెలిస్తే….. హుజూరాబాద్ ప్రజలకు గుళాంగిరీ చేస్తాం. ఈటల ఫస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఘోరీ కడతా అంటరు. టీఆర్ఎస్ కు అగ్గి పెడతా అంటరు. విలువలతో కూడిన రాజకీయమా..
మానవత్వం లేదు కేసీఆర్ అని అంటరు. ఆసరాపెన్షన్ తీసుకున్న అవ్వను, కళ్యాణ లక్ష్మి తీసుకున్న అమ్మను అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న చెల్లెను అడుగు, రైతులను అడుగు రైతు బంధు తీసుకున్న వాళ్లను వాళ్లు చెబుతురు. కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా. ప్రజాస్వామ్యంలో తమ పార్టీ చేసిన పనులు చెప్పుకోవాలి. లేదా ఎదుటిపార్టీ వైఫల్యాలు ఎత్తి చూపాలి.
బీజేపీని మీరు ఓన్ చేసుకోవడం లేదు, మిమ్నుల్ని బీజేపీ ఓన్ చేసుకోవడం లేదు. ఎక్కడా జై భారత్ మాత అనడం లేదు, జై శ్రీరాం అనడంలేదు. రాజేందర్ బీజేపికి దూరం ఉన్నరు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు తాను దూరం అన్నట్లు, తాను భాగం కాన్నట్లు మాట్లాడుతున్నడు. రాజేందర్ ప్రచార సరళి, తాను వేరు, బీజేపీ వేరు అన్నట్లు మాట్లాడుతున్నరు . నిజమైన బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలు బాధఫడుతున్నరు.
రాజేందరన్న మీరు బీజేపీ అనే బురద గుంతలో దిగారు. బురద అంటకుండా ఉంటుందా.. గ్యాస్ ధరలు బీజేపి ప్రభుత్వవిధాన నిర్ణయమా కాదా… కేంద్రం గ్యాస్ ధరలు పెంచదా దీనికి సమాధానం చెప్పాలి.
2014లో సబ్సిడీతో గ్యాస్ ధర 464 రూ.ఇవాళ గ్యాస్ ధర సబ్సిడీ పోను 912రూ. ఏడేళ్లలో గ్యాస్ ధర రెండింతలయింది. దీన్ని చూసి ఓటేయమని అడుగు. బీజేపీ జెండా, పువ్వు గుర్తు అని చెబుతున్నరుకదా.. దీనిపై మీ స్పందన ఏంటి.
గత పది రోజుల్లో ఏడు సార్లు పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారు. ప్రజలపై ప న్నుల భారంవేసి నిద్రపోనీయడంలేదు. దీని వల్ల నిత్యావసర వస్తువులు పెరిగాయి. ప్రభుత్వ రంగం సంస్థలను, రైళ్లను, విమానాశ్రయాలు అమ్ముతున్నరు. దీనివల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నరు. దీన్ని సమర్థిస్తారా…
రైతు వ్యతిరేక చట్టాలను మీరు ఆమోదిస్తరా… సమర్థిస్తరా… దీని మీ మనస్శాక్షి అంగీకరిస్తుందా చెప్పాలి. ఇవి రైతులకు ఉరితాళ్లు, వ్యతిరేకంగాపోరాడుతున్నారా…దీన్ని ఆమోదిస్తున్నారు..కేంద్రంవెనక్కు తీసుకుంటామని ఏమైనా చెప్పిందా..దీనిపై ఈటల స్పందించాలి. టీఆర్ఎస్ రైతులను కారెక్కించాలని అనుకుంటోంది. బీజేపీ రైతులపై కారెక్కిస్తుంది. దీనిపై అరవైవేల మంది రైతులు ఉన్న హుజూరాబాద్ ఆలోచించాలి.
హుజూరాబాద్ మహిళలపై గ్యాస్ ధరల భారంప డ్డా పర్వాాలేదు. మా రైతులకు ఆగమైనా పర్వాలేదు.పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ప ర్వాలేదు. నేను మాత్రం గెలవాలి. నాకు మాత్రం ప దవి కావాలని చెప్పదల్చుకున్నారాా….దీనిపై మీ స్పందన ఏంటి. పెట్రోల్ డిజీల్ ధరలు 110 రూ పెట్లోల్, డిజీల్ 103 రూపాయలు అయింది. బీజేపీ అధికారంలోప్రభుత్వంవచ్చిన 2014 నాటి నుంచి పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు రెట్టింపు అయ్యాయి.
హుజూరాబాద్ అక్కా చెళ్లెల్లారా గ్యాస్ బండకు దండ పెట్టి ఓటేయమని పిలుపునిస్తున్నాం. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి అని పిలుపునిస్తున్నాం.
దేశవ్యాప్తంగా కరెంటు కోతలు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్,యూపీ, కర్ణాటక, పక్క రాష్ట్రం ఏపీలో కోతలున్నాయి. కాని తెలంగాణలో కోతలులేవు. మనం మన అవసరాలకు తీరగా, పరిశ్రమలకు, గృహాలకు, రైతులకు ఇవ్వగా ఆరు నుంచి పది మిలియన్ల యూనిట్ విద్యుత్ పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం.
కేంద్రం నుంచి సింగరేణి లో పది హేను రోజుల నిల్వ ఉంది. మాకు బొగ్గు ఇచ్చేయమని మన రాష్ట్రం నుంచి తరలించే కుట్ర జరుగుతోంది. బొగ్గు లేకుండా కుట్ర చేసినందుకు ఓటు వేయాలా. వినోద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు హుజూరాబాద్ కు రైల్వైలేన్ మంజూరు చేయిస్తే.. దాన్ని మానకొండూరు – హుజూరాబాద్ లైన్ ను అటకెక్కించారు. రైల్వై లైన్ అటకెక్కించినందుకు ఓటువేయాలా..
నిత్యం అబద్దంతో లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నందుకు ఓటు వేయాలా. ఇది అభివృద్ధికి – అరాచానికి, న్యాయానికి- అన్యాయానికి, ధర్మానికి- అధర్మానికి మధ్య పోటీ. ధరలు పెంచేవాళ్లు ఓ వైపు ఉంటే – మేం సంక్షేమం చేపడుతున్నాం. జీడీపీ పెంచాలంటే -గ్యాస్ పెట్రోల్, డీజీల్ ధరలు పెంచారు. మిమ్నుల్ని చూసి పథకాలు ఏం వచ్చినయ్. దళిత బంధు మమ్ముల్ని చూసి వచ్చినయ్ అంటున్నారు. మరిరైతు బంధు , కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ పథకం ఎవరిని చూసి వచ్చింది.
ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నరు. ఇవ్వని దాన్ని ఇచ్చినట్లుగా,ప్రజలు తీసుకున్నట్లుగా వారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారు. చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో మంచి చర్చ జరగాలి. ఏడేళ్ల బీజేపీ పాలన- టీఆర్ఎస్ పాలనకు రిఫరెండంగా తీసుకుందాం. బీజేపీ ఏడే ళ్ల పాలన చూసి ఓటు వేయమని అడుగుదాం. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో ఏం చేసామో చెప్పి ఓటడుగుదాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి అబద్దాల ప్రచారం గోబెల్స్ ప్రచారం చేస్తరు. విషప్రచారాలు నమ్మవద్దు.

LEAVE A RESPONSE