– వైఎస్ షర్మిల
విజయవాడ: భారతరత్న, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడుకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తోంది… నవ భారత నిర్మాత, నవ యువతకు స్పూర్తిప్రదాత మన రాజీవ్ గాంధీ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
సమాచార విప్లవానికి పితామహుడు. టెలికమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి ముందుకు తీసుకెళ్లిన దార్శనికుడు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, సాంకేతిక విద్యను అందుబాటులో తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని ఆమె పేర్కొన్నారు.