– మాధవ్‌ను కోరిన చిక్కోలు వాసులు
శ్రీకాకుళం: ప్రపంచ నాగరికత ఆనావాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నాయి. సారథ్యం యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన ఛాయ్ పే చర్చ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. శ్రీకాకుళం గొప్ప తనాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంలో ఏ దేశానికీ వెళ్ళినా శ్రీకాకుళం వాస్తవ్యులు తారసపడతారు.
శ్రీ కాకుళం దేశ భక్తులు నిలయమన్నారు.
ఛాయ్ పే చర్చ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా నిర్వహించారు. స్థానిక సమస్యలపైన దృష్టి కేంద్రీకరించడానికి ఇటువంటి చర్చా కార్యక్రమాలు ఉపయోగపడతాయి అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం లో స్టేడియం అభివృద్ధి పరచాలని, శ్రీకాకుళం స్మార్ట్ సిటీ పథకంలో చేర్చాలని స్థానికులు ఈ సందర్భంగా మాధవ్ కు విజ్ఞప్తి చేశారు.