నిను వీడని నీడను నేనే…!
పిలువకురా…అలుగకు రా…నలుగురిలో నను పలుచన చేయకురా..!
కంటిలోన నలుసు..చెవిలో జోరీగ ఈయన వేధించే తీరే వేరు.
వెర్రెక్కించి కిర్రెక్కించి వదులుతారు.
అసలే జనాగ్రహం..!
ఆపై ప్రతిపక్షం దూకుడు…!
పైవాడు చేతికి దొరికింది దొరికినట్టు పట్టుకుపోతున్నాడు.
ఇక్కడ కోర్డులే మొట్టి కాయలు వేస్తున్నాయనుకుంటే ..!
అంతర్జాతీయ న్యాయస్ధానం కూడా సుత్తి దెబ్బ వేసింది.
సోది కెళితే రంకు బయటపడినట్టు రస్ ఆల్ ఖైమా కి పరిహారం కట్టలేరు..కట్టకుండా ఉండలేరు.
మరోపక్క డ్రగ్స్… గంజాయి గోల..!
రఘురాజుగారు మళ్ళీ సినిమా చూపిస్తమామా అంటూ బయలుదేరాడు.
ఫస్ట్రేషన్ పీక్స్..!
రాజు గారు కేసులేసి ఊరుకోరు…!
నిత్యం కరెక్టుగా మిట్టమధ్యాహ్నం మొదలెడతారు.
అన్నం ముద్ద దిగటం లేదు..!
ఆ ఎటకారానికి సగం చచ్చిపోవాలనిపిస్తుంది.
పుండు కెలికి..నిమ్మరసం పిండి ఉప్పు కారం చల్లుతారు.
అబ్బ సాయిరామ్..!
తీసుకెళ్ళి కొట్టిన సంతోషం అసలు నిలవలేదు.
పుండు సలుపుడు మూడు రెట్లు పెంచేసారు.
జైలు కెళ్ళాల్సి వస్తే…అధికారం అంతమయితే..!
అది ఊహించనలవి కాదు.
రాజు గారి సెటైర్లు..విసుర్లు తట్టుకో తరమా..!?
గరుడపురాణం లోని శిక్షలన్నీ వేసేస్తున్నారు.
శూలదండన..!
క్రిమిభోజనం..!
కుంభీపాకం…!
మానసికంగా అన్నీ అనుభవంలోకి వచ్చేస్తున్నాయి.
-అడుసుమిల్లి శ్రీనివాసరావు