చంద్రబాబు ఆక్రమ ఆరెస్టును ఖండిస్తూ నెథర్లాండ్స్ లోని హేగ్ నగరం లో భారతీయ రాయబార కార్యాలయం నుండి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు తెలుగుదేశం అభిమానులు జోరు వర్షంలోను ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యహరించాలని శాంతి భవనంగా భావించబడే అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర “ఆక్రమ ఆరెస్టు ఆపాలి”, “మేము సైతం బాబు కోసం”, “save democracy in AP “, “We are with CBN “, “ఇంటికో IT ఉద్యోగం బాబు గొప్పతనమే” మరియు “సైకో పోవాలి సైకిల్ రావాలి” అంటూ నినాదాలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు జైల్లో ఉండడం మాకు ఎంతో బాధ, ఆవేదన కలిగిస్తుందని అందుకే బాబు గారికి సంఘీభావంగా రోడ్డెక్కామని వక్తలు పేర్కొన్నారు. బాబు గారు వెంటనే విడుదల కావాలని, వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమం NRI TDP నెథర్లాండ్స్ అధ్యక్షులు వివేక్ కరియావుల, ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ కోక నాయకత్వంలో ముఖ్య సభ్యులు మధుకర్ రెడ్డి బండార్ల, బాలు అల్లిడి, వినోద్ బుడ్డి, మహీధర్ ఉడత, సునీల్ వేములపల్లి, రవితేజ చెరుకూరి, రమేష్ నెల్లూరి, పవన్ కోర, నవీన్ ఆచంట, తారక్, రాజ్ ఇంటూరి, సంపత్ ఐనంపూడి, శివ భైరపనేని, షబ్బీర్ సాహెబ్, శుభాని షేక్, మరియు రామకృష్ణ ప్రసాద్ ముప్పా కృషితో విజయవంతమైంది.