– మంత్రి నరేంద్ర మోడీ
అయోధ్యలో 500 వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్య నగరంలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. ఈ రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం రామనామ స్మరణతో ఉప్పొంగిపోయింది.
రామ్‌లల్లా ఇప్పటి నుంచి టెంట్లో ఉండడు
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమన్నారు. మన రామ్‌లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగిందని మోడీ తెలిపారు.
ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయమని పేర్కొన్నారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు ఉంటాడు.. సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఇవాళ దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్నారు. రామ మందిరాన్ని న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం.. దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటుందని ప్రధాని మోడీ తెలిపారు. శ్రీ రాముడు భారతదేశ ఆత్మ అని చెప్పారు.. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా.. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించా.. అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను.
రాముడు లోకానికి ఆదర్శమని మోడీ అన్నారు. రాముడే శాశ్వతం, రాముడే విశ్వం.. రాముడి రాక కోసం ఎదురు చూసిన శబరి నిరీక్షణ ఫలించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ క్షణాలు కాలచక్రంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.. రామభక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు మోదీ. మన రాముడొచ్చేశాడు.. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం నా అదష్టం.. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందని మోడీ చెప్పారు.