ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు

-అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
-ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం
-ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి
-ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన
-త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ
-ప్రధాని మోదీ

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని తెలిపారు. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు.

ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఒక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు.

వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రాముడే భారత్ కు ఆధారం… రాముడే భారత్ విధానం… నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు… భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ” అంటూ ప్రధాని మోదీ వివరించారు.

Leave a Reply