Suryaa.co.in

Andhra Pradesh

పేద ,బలహీన వర్గాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలు అమానుషం

– ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్

వైకాపా ప్రభుత్వ నిరంకుశ చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.40 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తూ చివరికి ఉద్యోగాల నుండి తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నించటం అమానవీయ దుర్మార్గ చర్య అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

తమది పేదల ప్రభుత్వమని…నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి పేద వర్గాలకు బలహీనవర్గాలకు చెందిన అంగన్వాడీల పైన నిరంకుశ వైఖరిని అనుసరిస్తూ వాళ్ల భవిష్యత్తుపై వేటువేయటం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్నది.

అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలను వెంటనే ఆపివేసి.. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా ముందుకెళితే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించటం ఖాయమని, సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది.

LEAVE A RESPONSE