కడప స్టీల్ ప్లాంట్ తో అభివృద్ధి దిశగా రాయలసీమ

ఎంపీ విజయసాయి రెడ్డి

ఫిబ్రవరి 15:  కపడ స్టీల్ ప్లాంటుకు బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన భూమి పూజ రాయలసీమ అభివృద్దికి బలమైన పునాదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలను వెల్లడించారు. సున్నపురాళ్లపల్లెలో ప్లాంట్ నిర్మాణ పనులు జేఎస్ డబ్ల్యూ సంస్థ చేపట్టనున్నట్లు తెలిపారు. 8800 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్  మొదటి దశలో 3300 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 30 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 25000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యాటకులు, భక్తులకు  భద్రత మరింత పటిష్టం కానుందని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేర్వేరు పర్యాటక స్థలాలు, ఆధ్మాత్మిక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ వర్చువల్ విధానంలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారని అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు అనుబంధంగా కియోస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంస్కరణలతో పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అన్నారు.

పౌర విమానయాన రంగంలో ఉజ్వల భవిష్యత్
భారతదేశంలో పౌర విమానయాన రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు టాటా గ్రూపు కుదుర్చుకున్న ఒప్పందమే ఇందుకు నిదర్శనమని విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని రకాల విమానాలు మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్ లకు సంబందించి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్ర బిందువు కాగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన అన్నారు.

Leave a Reply