Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన నారా లోకేష్

న్యూఢిల్లీ, : రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేసిన తీరు గురించి లోకేష్, టిడిపి ఎంపిలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురద చల్లే లక్ష్యంతో అరెస్ట్ చేశారు అంటూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతి కి లోకేష్, టిడిపి ఎంపిలు అందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని లోకేష్, ఎంపీలు కోరారు.

LEAVE A RESPONSE