Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసు ఉచ్చు నుంచి ఏ శక్తి ముఖ్యమంత్రి దంపతుల్ని కాపాడలేదు

– వివేకా హత్య జరిగినరోజు ఎంపీ అవినాశ్ రెడ్డి, నవీన్, ఓఎస్డీకృష్ణమోహన్ రెడ్డిల ఫోన్ ద్వారా భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలతో పదేపదే మాట్లాడానని చెప్పాక కూడా, ముఖ్యమంత్రి దంపతులు తమకేమీ తెలియదని బుకాయించడం ముమ్మాటికీ పెద్దతప్పే
• వివేకాహత్యకేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతులు ఏం చెబుతారా అని రాష్ట్రప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు
• జగనాసుర రక్తచరిత్ర బయటపడ్డాక కూడా ముఖ్యమంత్రి దంపతులు మీనమేషాలు లెక్కించడంలో అర్థంలేదు
• హత్య జరిగిన రోజు ఉదయం 6.29నిమిషాలకు మృతదేహం వద్దకు వెళ్లిన అవినాశ్ రెడ్డి, పదేపదే వారితో ఫోన్లో మాట్లాడుతూనే సాక్ష్యాధారాలు రూపుమాపాడు. శవానికి కట్లు కట్టించాడు
• అవన్నీ ముఖ్యమంత్రి దంపతులు చెబితేనే చేశాడా?
• అది హత్యకాదు, గుండెపోటు అని వారు చెప్పమంటనే చెప్పాడా?
• ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు నాశనం చేయడానికి మీ దంపతులే సలహాలిచ్చారు అని నేనంటాను.. కాదని చెప్పగల ధైర్యం మీకుందా ముఖ్యమంత్రిగారు?
• హత్యజరిగిన విధానం పూర్తిగా తెలిసిన అవినాశ్ రెడ్డి, హత్యజరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి దంపతులతో మాట్లాడితే, సీబీఐ వెంటనే వారినెందుకు విచారించడంలేదు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వివేకానందరెడ్డి హత్యజరిగిన రోజు తాను, నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేసి, వారిద్వారా పదేపదే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని అవినాశ్ రెడ్డి సీబీఐ తో చెప్పాకకూడా, ముఖ్యమంత్రి దంపతులు వివేకాహత్యతో తమకు ఎలాంటిసంబంధం లేద ని బుకాయించడం ముమ్మాటికీ పెద్దతప్పేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తేల్చిచెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“వివేకానందరెడ్డి హత్యకేసులో తమకు తెలిసిన నిజాలను జగన్ రెడ్డి, ఆయన సతీమ ణి భారతిరెడ్డి సీబీఐకి, రాష్ట్రప్రజలకి చెప్పాలి. వివేకాహత్యకేసులో తమకేమీ తెలియదని వారు ఇంకా బుకాయించడం చాలాపెద్దతప్పు. ఎవరు హత్యచేశారో, ఎలాచేశారో, ఎవరుచేయించారో అన్నీవారికి తెలుసు. ఇంత తెలిశాకవారు ఇంకా మౌనం వహిం చడం సరైందికాదు.

వివేకాహత్యజరిగిన రోజున అవినాశ్ రెడ్డి భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలతో ఫోన్లో ఏం మాట్లాడాడు అన్నదే ఇప్పుడు హత్యకేసులో కీలక ఆధారం
తాను ఎప్పుడు భారతితో ఫోన్ మాట్లాడాలన్నా నవీన్ కు ఫోన్ చేస్తానని, అలానే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలన్నా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేస్తానని ఎంపీ అవినాశ్ రెడ్డి ఇప్పటికే సీబీఐ విచారణలో చెప్పాడు. హత్యజరిగిన రోజు రాత్రి నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలతో ఉన్నారోలేదో కానీ, వారిఫోన్లు మాత్రం ముఖ్యమంత్రి దంపతుల వద్దే ఉన్నాయి. వివేకానందరెడ్డి చనిపోయినరోజు నవీన్, కృష్ణమోహన్ రెడ్డిల ఫోన్లకు అవినాశ్ రెడ్డి పదేపదే ఫోన్ చేశాడని సీబీఐ విచారణలో తేలాక కూడా, అవినాశ్ రెడ్డి తమకు ఫోన్ చేయలేదని భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఆ రోజున మీ దంపతులకు ఎన్నిఫోన్లు వచ్చాయి.. అవినాశ్ రెడ్డి మీతో ఏం మాట్లాడారన్నదే వివేకాహత్యకేసులో ఇప్పుడు ప్రధాన ఆధారం. అవినాశ్ రెడ్డి పదేపదే మీతో ఏం మాట్లా డాడో చెప్పాల్సిన బాధ్యత మీ దంపతులపైనే ఉంది. జగనాసుర రక్తచరిత్ర బయట పడ్డాక కూడా మీ దంపతులు మీనమేషాలు లెక్కించడంలో అర్థంలేదు.

వివేకాహత్యజరిగిన నాడు సాక్ష్యాధారాలు రూపుమాపమని అవినాశ్ రెడ్డికి జగన్మో హన్ రెడ్డి దంపతులే చెప్పారని నేనంటాను.. కాదని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
వివేకానందరెడ్డి హత్యగావింపబడిన మార్చి15, 2019న ఉదయం 6.29 నిమిషాలకు అవినాశ్ రెడ్డి మృతదేహం వద్దకు వెళ్లారు. శవం అక్కడఉండగానే అవినాశ్ రెడ్డి పోలీసు ల్ని రాకుండా అడ్డుకున్నారు. వచ్చినవారిని లోపలికి రావద్దన్నాడు. అదేసమయంలో ఫోన్లో మాట్లాడుతూ, సాక్ష్యాలు రూపుమాపే ప్రయత్నంచేశాడు. అప్పుడు అవినాశ్ రెడ్డి ఫోన్లో మాట్లాడింది ముఖ్యమంత్రి దంపతులతోనేనా? అన్నిసార్లు అవినాశ్ రెడ్డి మీకు ఫోన్ చేస్తే, మీరు అతనికి ఏం చేయమనిచెప్పారు? మీరే మీ ఆసుపత్రి నుంచి కాంపౌండర్ ని పిలిచి శవానికి కుట్లు వేయించమని చెప్పారా? అది హత్యకాదు, గుండె పోటు అని భారతిరెడ్డిగారే చెప్పమన్నారా? ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారా? ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు నాశనం చేయడానికి మీరే సలహాలిచ్చారని నేనంటా ను.. కాదని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారిం చాక, అతను చెప్పినదాన్ని బట్టి, నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను విచారించాక కూడా, ముఖ్యమంత్రి దంపతులు తమకేమీ తెలియదంటే ప్రజలు ఎవరూ నమ్మే స్థితి లో లేరు. మీ బాబాయ్ ని ఎవరు చంపారనే ఘట్టంలో మీకు తెలిసిన విషయాలు రాష్ట్ర ప్రజలకు చెప్పరా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంద ర్భంలో నా దృష్టికి వచ్చిన అన్నివిషయాలను ప్రజలముందు ఉంచుతాను అని ప్రమా ణం చేసిన జగన్మోహన్ రెడ్డి, తనబాబాయ్ హత్యకేసులోని నిజాలను ఎందుకు బయట పెట్టడంలేదు?

అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటానికి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేస్తానని చెప్పాక, సీబీఐ ఎందుకు వెంటనే ముఖ్యమంత్రిని విచారించలేదు?
అవినాశ్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఓఎస్డీకి ఫోన్ చేశానని చెప్పాడో, వెంటనే సీబీఐ జగన్మోహన్ రెడ్డిని విచారించాలి కదా! అవినాశ్ రెడ్డి నుంచి నవీన్ ఫోన్ కు ఫోన్లు వచ్చి, ఆఫోన్లద్వారా భారతిరెడ్డి గారు మాట్లాడారని తెలిశాక వెంటనే ఆమెను విచారిం చాలి కదా! అదిచేయకుండా సీబీఐ ఎందుకు నత్తనడక నడుస్తోంది. అవినాశ్ రెడ్డితో మీరు ఏం మాట్లాడారని ముఖ్యమంత్రిని, ఆయనని సీబీఐ ఎందుకు ప్రశ్నించదు? హత్యజరిగిన విధానం పూర్తిగా తెలిసిన అవినాశ్ రెడ్డి, హత్యజరిగిన వెంటనే శ్రీమతి భారతి, జగన్మోహన్ రెడ్డి తోనే మాట్లాడాడు. అటువంటప్పుడు సీబీఐ వెంటనే విచారించాల్సింది వారినేకదా? మీ బాబాయ్ ని చంపిన నేరస్తులు ఎవరో చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు ముఖ్యమంత్రి గారు? మీతల్లి విజయమ్మ మీ రెండుచేతులు పట్టుకొని, బాబాయ్ ని చంపిన వారిని అరెస్ట్ చేయించమని మిమ్మల్ని అడిగింది నిజం కాదా ముఖ్యమంత్రి ?

మీ పిన్ని సౌభాగ్యమ్మ, వివేకా కూతురు డాక్టర్ సునీత మిమ్మల్నిఎన్నిసార్లు వేడుకున్నారు? ఇంతజరిగాక, సీబీఐ విచారణలో అవినాశ్ రెడ్డి, నవీన్ ఫోన్ ద్వారా భారతిరెడ్డితో, కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని చెప్పాక కూడా, మాకేంతెలియదని బుకాయించ డానికి మీకువీల్లేదు ముఖ్యమంత్రి. వివేకాహత్యకు రూ.40కోట్ల సుపారీ ఇచ్చేంత ఆర్థిక స్తోమత అవినాశ్ రెడ్డికి లేదు. అతనికి ఎవరినుంచి ఆ డబ్బు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందో మీకు తెలియదా ముఖ్యమంత్రి ? వివేకానందరెడ్డి హత్యకేసు ఉచ్చునుంచి ముఖ్యమంత్రి దంపతులు తప్పించుకోలేరు. ఈ ఉచ్చులో వారిద్దరూ చిక్కుకున్నారు.. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగల్లా అయ్యింది వారిపరిస్థితి. పదేపదే ‘పైన దేవుడున్నాడు.. కింద ప్రజలున్నారు’ అనే ముఖ్యమం త్రిగారు, ఇప్పుడైనా ఆ ప్రజలకు నిజం చెప్పాలి” అని రామయ్య డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE