అంగన్వాడీలపై జగన్ రెడ్డి తీరు పిరికిపంద చర్య

-చలో విజయవాడతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు
-అంగన్వాడీల కన్నీటిలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు, పెత్తందారీ పోకడలకు పరాకాష్ట. తన నివాసాన్ని ముట్టడిస్తారనే భయంతో జగన్ రెడ్డి అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడను జగన్ రెడ్డి అడ్డుకోవడం పిరికిపంద చర్య. న్యాయమైన డిమాండ్ల పరిష్కరం కోసం 40 రోజులుకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం, విధుల నుంచి తొలగించడం,వేతనాల్లో కోత పెట్టడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు దుర్మార్గం. జగన్ రెడ్డి నియంత అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?

సమ్మెకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతను అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యానులో ఇష్టమొచ్చినట్టు తిప్పుతున్నారు. ఇష్టానుసారం వ్యవహరించడానికి రాష్ట్రం జగన్ రెడ్డి జాగీరా? ఒక్కో అంగన్వాడీ కార్యకర్త అపరకాళిగా మారి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని భస్మంచేయడం ఖాయం.

Leave a Reply