ఒక్క ఫోటో కోసం వనపర్తి నుంచి…!

Spread the love

అమరావతి: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగేందుకు తెలంగాణ నుంచి ఓ యువకుడు పని గట్టుకుని వచ్చారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి కి చెందిన జంగా శ్రీవర్థన్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. మాజీ సిఎం చంద్రబాబు కు పెద్ద అభిమాని అయిన శ్రీవర్ధన్ చాలా కాలంగా అయనను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబును కలిసి ఒక్క ఫోటో దిగాలనేది శ్రీవర్థన్ కోరిక. దీని కోసం ఇతర స్నేహితులను వెంటబెట్టుకుని శ్రీవర్థన్ అమరావతి వచ్చారు. నిన్ననే విజయవాడ చేరుకున్న శ్రీవర్ధన్ చంద్రబాబు పార్టీ
vanaparthi కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలుసుకుని సెంట్రల్ ఆఫీస్ కు వచ్చారు. ఈ విషయంలో తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది అధినేతకు శ్రీవర్థన్ గురించి వివరించారు.

దీంతో చంద్రబాబు శ్రీవర్ధన్ తో ఫోటో దిగడమే కాకుండా కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు. అతని యోగక్షేమాలు తెలుసుకుని అభినందించారు. చంద్రబాబుతో సెల్ఫీ కూడా తీసుకున్న శ్రీవర్ధన్ దీనికోసమే వచ్చాను సర్ అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.

Leave a Reply