Suryaa.co.in

Andhra Pradesh

బాబు భద్రతకు ముప్పు..పార్టీ ఆఫీసు వద్ద సెక్యూరిటీ పెంచండి

-డీజీపీ కసిరెడ్డికి టీడీపీ నేత వర్ల లేఖ

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద పోలీసు భద్రతను తొలగించటంపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ పార్టీ కార్యాలయానికి వచ్చి, వందలాదిమందిని కలిసే టీడీపీ చీఫ్ చంద్రబాబు భద్రతకు ముప్పు ఉన్నందున, పార్టీ ఆఫీసు వద్ద పోలీసు భద్రత పెంచాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డికి రాసిన లేఖలో కోరారు. ఇటీవల తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ గూండాలు జరిపిన దాడిని గుర్తు చేసిన రామయ్య, ఎలాంటి నోటీసు లేకుండా పార్టీ ఆఫీసు వద్ద పోలీసు భద్రత తొలగించడాన్ని నిరసన వ్యక్తం చేశారు.వర్ల రామయ్య లేఖ ఇదీ..

టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా సర్వే నంబర్లలో 392/1, 3, 4, 8, 9 & 10 లలో ఉంది.
• టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ సి.ఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా కార్యక్రమాలకు హాజరవుతారు.
• ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో సహా టీడీపీ సీనియర్ నాయకులు కూడా పార్టీ కార్యాలయంకు హాజరవుతున్నారు.
• ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
• చంద్రబాబు నాయుడు ఎన్.ఎస్.జి పరిధిలో గల జెడ్+ కేటగిరీ భద్రతా వలయంలో ఉన్న నాయకులు.
• ఆయనకు సంఘ విద్రోహ శక్తులు నుంచి ముప్పు ఉంది.
• రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉంది.
• 19 అక్టోబర్ 2021న, అధికార వైసీపీకి చెందిన కొంతమంది గూండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు.
• దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్తలను చంపడానికి ప్రయత్నించారు.
• దాడి జరగక మునుపు కార్యాలయానికి 24 గంటలూ సాయుధ భద్రత ఉండేది.
• ఆశ్చర్యకరంగా, పార్టీ కార్యాలయానికి ఎటువంటి సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా భద్రతను తొలగించారు.
• టిడిపి కార్యాలయం పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయం పక్కనే ఉన్నప్పటికీ అధికార పార్టీ అనుచరులుగా చెప్పుకుంటున్న గూండాలు దాడికి తెగబడ్డారు.
• పై కారణాల దృష్ట్యా, పార్టీ కార్యాలయంపై ఎలాంటి దాడులు జరగకుండా, కార్యాలయాన్ని సందర్శించే ప్రజలకు రక్షణ కల్పించేందుకు 24 గంటలపాటు సాయుధ భద్రత కల్పించాలని అభ్యర్థిస్తున్నాను.

LEAVE A RESPONSE